నదిలో ఎడారి
గతమంతా పచ్చని పైరులతో పరవశించిన నేలంతా..నెర్రలిడి
నదిలో ఎడారి మొలిసింది
నీటిసుక్కలన్నింటి మింగేసి..
ఎదలో దుఃఖాన్ని పారిస్తుం
పంటకాపు మాగాణి సాళ్లలో..
పల్లెర్లను మొలిపిస్తుంది
గతమంతా పచ్చని పైరులతో
పరవశించిన నేలంతా..నెర్రలిడి
నోళ్లుతెరిసి…పచ్చికబయళ్లను కబళించింది.
ధాన్యపు రాసుల ఇలాకాలో…
ఇసుక కుప్పలను పేర్చింది
అన్నదాత జీవితాన ఆనందాన్ని నరికేసింది
కనకవర్షాన్ని దూరం చేసి కన్నీటి వర్షాన్ని మిగిల్చింది
హాలికుడి ఆర్తనాదాలను వింటుందా అంబరం
కృషీవలుడి కన్నీటిని చూసి..కురిపిస్తుందా అంబుదం
నేద్యకాడి ఇంట వెలుస్తుందా సంబరం
వానధారలను రాల్చుతుందా వసంతం
ఏడారి దారిలో సాగుతుందా రైతు జీవితం
కరువుకోరల్లో చిక్కుకొని చిందిస్తుంది
ఆకుపచ్చని పంటల రాగం
చినుకుజాడ కరువై మదనపడుతుంది నదీగర్భం
జ్ఞాపకాన్ని నెమరేస్తూ కుమిలిపోతుంది సలిలం
పొలిమేర్లన్నీ పచ్చగా పండాలంటే కర్షకుడు
కన్నీటి చరిత్రను రాయాలి
బీడుపడ్డ భూమిలో పసిడి సిరులు కురవాలంటే
దేహాన్ని మంచుకొండలా కరిగించాలి
పారుతున్న కాలువల్లో ఎడారి దర్శనమిస్తుంటే
తనువులోంచి రుధిరాన్ని చిందించాలి
ఎగురుతున్న అలలను నరికేసిన కాలానికి
నాలుగు మెతుకులు సవాలు విసురుతున్నాయి.
కరువుకోరల్లో చిక్కుకొన్న ప్రకృతికి
కాళేశ్వరం జలధారలు గుర్తొస్తున్నాయి.
చెట్లన్నీ గతంలో పొంగిన పాలపొంగుల నీటిధారుల
జాడను వెతుకుతున్నాయి
పొలాలన్నీ ఆకాశాన్నితాకేల పొంగిన ఉదకం
జాడెక్కడని అన్వేషిస్తున్నాయి
పురుడు పోసుకుంటున్న మొక్కలన్ని ..
ఆయువును విడిచి నేలరాలుతున్నాయి
రేపటి భవిష్యత్తును ప్రశ్నిస్తున్నాయి.!
-అశోక్ గోనె, 9441317361
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

