శ్రీరామనవమి
కోడి కోయంచు కూయగా వాడలందు నిద్ర లేచిన జనులంత నియతి తోడ తమదు కార్యములను సాగు క్రమముగనగ మనల నడిపించు మంత్రమేదని తలంచ
కోడి కోయంచు కూయగా వాడలందు
నిద్ర లేచిన జనులంత నియతి తోడ
తమదు కార్యములను సాగు క్రమముగనగ
మనల నడిపించు మంత్రమేదని తలంచ,
రామ రామయన్న రమ్యనాదము వింటి
యెక్కడెక్కడంటు దిక్కులన్ని
అరయ, తుదకు దొరికె ఆత్మచిలుక లోన
గుండెకొమ్మ నుంచి ఉండి ఉండి!
కష్టకాలాలె ఎదురొచ్చు కరువులొచ్చు
దుఃఖనదులన్ని దాటేటి దుర్దినమ్ము
పలకరించుచు రావచ్చు, భయమువలదు
రామ యని తలంచ మదికి రక్షగల్గు!
తండ్రిమాట వినెడు తనయులుండినచోట
అభయమిచ్చి నిల్చు శుభదహృదిని
యెదుటివారి మంచి, యెపుడు చూసేయింట
రామచంద్రుడుండి రక్షసేయు!
పాలసంద్రమందు పవ్వళించిన నీవు
కటికనేల నేల కష్టపడుటొ?
గరుడవాహనమున గమియించెడు నీవు
కాలినడకనడవి గడుపుటేలొ?
శ్రీలక్ష్మి సేవలో చిలికేటి నీ నవ్వు
ఆలికొరకు వడలికూలుటేలొ?
భక్తజన విహారి వైకుంఠపురి వీడి
భువిని కష్టములను పొందనేల?
అర్థమయ్యేను శ్రీరామ ఆత్మలోన
మనిషికాదర్శ దర్శన మహిమదెల్పి
కష్టసుఖములనొకరీతి యిష్టపడుమ
నాచరించుచు చూపిన నీ చరిత్ర!
డాక్టర్ కాసర్ల నరేశ్‌రావు
94414 06252
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

