బకాయిల బందిఖానాలో ఖజానా
వేల కోట్ల పెండింగ్ బిల్లులతో ఉద్యోగుల కన్నీళ్లు..న్యాయం కోసం సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు! గ్రాట్యుటీ, జీపీఎఫ్, సరెండర్ లీవులు, రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం ఎదురుచూపులు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాల్సిన ప్రభుత్వం..ప్రజలకు సేవలందించే ఉద్యోగుల సమస్యలను కూడా సకాలంలో పరిష్కరించలేకపోతే పరిపాలనా వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతాయి.
వేల కోట్ల పెండింగ్ బిల్లులతో ఉద్యోగుల కన్నీళ్లు..న్యాయం కోసం సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు! గ్రాట్యుటీ, జీపీఎఫ్, సరెండర్ లీవులు, రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం ఎదురుచూపులు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాల్సిన ప్రభుత్వం..ప్రజలకు సేవలందించే ఉద్యోగుల సమస్యలను కూడా సకాలంలో పరిష్కరించలేకపోతే పరిపాలనా వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతాయి. రాష్ట్రంలో ప్రస్తుతం రెగ్యులర్ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న పెండింగ్ బిల్లుల సమస్య ఇలాంటి పరిస్థితినే ప్రతిబింబిస్తున్నది.ఏండ్ల్ల తరబడి ప్రభుత్వానికి సేవలందించిన ఉద్యోగులు తమకు చట్టబద్ధంగా అందాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతుండగా, మరోవైపు తమ బిల్లుల చెల్లింపుల కోసం కాంట్రాక్టర్లు ఎదురుచూస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాల్సిన ఆర్థిక శాఖను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్న బాధితులకు ఎదురవుతున్న ఆంక్షలు, నిరీక్షణ, నిరాశ ప్రభుత్వ పాలనా తీరుపై చర్చకు దారితీస్తున్నాయి.
ఉద్యోగుల గ్రాట్యుటీ, జీపీఎఫ్, సరెండర్ లీవులు, టీజీఎల్ఐ, గ్రూప్ ఇన్సూరెన్స్, అడ్వాన్స్ బిల్లులు, ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలకు సంబంధించిన బకాయిలు వేల కోట్ల రూపాయలకు చేరినట్లు ఉద్యోగ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కుటుంబ అవసరాలు, వైద్య ఖర్చులు, పిల్లల చదువులు, గృహ రుణాలు, ఇతర ఆర్థిక బాధ్యతలను నిర్వహించాల్సిన సమయంలో తమకు రావాల్సిన సొమ్ము అందకపోవడం వారిని తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నది.
రాష్ట్ర ఆదాయాలు, వ్యయాలు, బడ్జెట్ కేటాయింపులు, ప్రభుత్వ బిల్లుల చెల్లింపులు, ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే ఆర్థిక శాఖ ప్రజలకు, బాధితులకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉన్నది. బాధితులకు న్యాయం చేయడం ప్రభుత్వ ప్రథమ బాధ్యత. బకాయిలు చెల్లింపుపై స్పష్టత ఇవ్వడం, వినతులను స్వీకరించడం, ఫైళ్ల స్థితిని తెలియజేయడం, నిర్ణీత గడువులో పరిష్కారం చూపడం వంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది.
జిల్లాల నుంచి హైదరాబాద్ వస్తున్న ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు తమకు రావాల్సిన బకాయిల కోసం ఎన్నో ఆశలతో సచివాలయానికి చేరుకుంటారు. తమ సమస్యను సంబంధిత అధికారికి వివరించి, ఫైల్ ఎక్కడ ఆగిపోయిందో తెలుసుకొని, ఎప్పుడు డబ్బులు వస్తాయో స్పష్టత పొందాలని కోరుకుంటున్నారు. కానీ కార్యాలయాల్లోకి వెళ్లేందుకు అనుమతి లభించకపోవడం, సంబంధిత అధికారులను కలిసే అవకాశం లేకపోవడం తమకు మరింత ఇబ్బందిగా మారిందని వారు చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో కార్యాలయ సిబ్బంది బయటకు వచ్చి వినతిపత్రాలను స్వీకరిస్తున్నారని బాధితులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన రిటైర్డ్ ఉద్యోగులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు రాకుండా ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు చేయడం తక్షణావసరం.
పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం కాంట్రాక్టర్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం విశ్రాంత ఉద్యోగులు, ఇతర ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రభుత్వ సిబ్బంది ఆర్థికశాఖను ఆశ్రయిస్తున్నారు. కొందరికి టోకెన్లు ఇచ్చినా, సమస్యలు పరిష్కారం కావడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఫైళ్లను పరిశీలించే అధికారులకు అవసరమైన అధికారాలు, నిధుల విడుదలపై నిర్ణయాలు తీసుకునే స్థాయిలో సమన్వయం, బాధితులకు జవాబుదారీతనం ఉండాలి. సర్వీసులో ఉన్నప్పుడు జీతం ద్వారా కుటుంబాన్ని నడిపించిన వ్యక్తి, రిటైర్మెంట్ తర్వాత తన సొంత డబ్బు కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగాల్సి రావడం బాధాకరం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రభుత్వానికి ఇష్టమొచ్చినప్పుడు చెల్లించే అదనపు సాయం కాదు. వర్తించే నిబంధనలు, అర్హతల ప్రకారం ఉద్యోగికి అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలు. అందువల్ల బకాయిల చెల్లింపులో పారదర్శకత, సమయపాలన, బాధితులకు స్పష్టమైన సమాచారం ఉండాలి.
ప్రతి నెలా సుమారు 500 మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేస్తున్నారు. వారికి అవసరమైన రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం నెలకు సుమారు రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు నిధులు అవసరమవుతున్నాయి. ఒకవైపు పాత బకాయిలు చెల్లించాల్సి ఉండగా, మరోవైపు కొత్తగా ఉద్యోగ విరమణ చేస్తున్న ఉద్యోగులకు ప్రయోజనాలు అందించాలి. ప్రస్తుత బకాయిల పరిష్కారానికి తగిన మొత్తంలో నిధులు విడుదల చేయకపోతే, పాత బకాయిలు తగ్గకపోగా కొత్త బకాయిలు పేరుకుపోయే ప్రమాదం ఉన్నది. 2027 మార్చి నాటికి బిల్లుల బకాయిలను గణనీయంగా తగ్గించాలంటే నెలకు సుమారు రూ.2,000 కోట్ల మేర నిధుల విడుదల అవసరం. ఈ అంచనాకు సంబంధించిన మొత్తం బకాయిలు, ఇప్పటికే చెల్లించిన మొత్తాలు, కొత్తగా చేరుతున్న బిల్లులు, ఇతర ఆర్థిక బాధ్యతల వివరాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించాలి.
జిల్లా పరిషత్ జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్లు, కమ్యూటేషన్, రిటైర్డ్ ఉద్యోగుల ఇతర ప్రయోజనాల చెల్లింపులు జరిగినట్లు కొన్ని వర్గాలు చెప్తున్నాయి. కమ్యూటేషన్ చెల్లింపుల్లో పురోగతి ఉన్నప్పటికీ, మిగిలిన బకాయిలపై ఉద్యోగులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉన్నది. ఏ విభాగానికి ఎంత చెల్లించారు? ఏ బకాయిలు ఇంకా మిగిలి ఉన్నాయి? ఏ ప్రాతిపదికన చెల్లింపులకు ప్రాధాన్యత ఇస్తున్నారు? అనే వివరాలను ప్రభుత్వం బహిరంగపరచాలి. ప్రతిసారీ నిధుల కొరతను కారణంగా చూపితే, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు లభిస్తుంది? ఆర్థిక క్రమశిక్షణ పేరుతో ఉద్యోగులకు చెల్లించాల్సిన ప్రయోజనాలను నిరవధికంగా వాయిదా వేయడం సరైన విధానం కాదు. ప్రభుత్వం తన ఆదాయ వ్యయాలను సమీక్షించి, అత్యవసర చెల్లింపులకు ప్రాధాన్యతనిస్తూ స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలి. ఇప్పటికే ఉద్యోగ విరమణ చేసినవారి బకాయిలు, వైద్యపరమైన అత్యవసర అవసరాలు ఉన్నవారి క్లెయిమ్‌లు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్లు, సరెండర్ లీవులు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించాలి.
ఉద్యోగుల ఓపికకు కూడా ఒక హద్దు ఉంటుంది. ప్రభుత్వంపై నమ్మకంతో ఎదురుచూస్తున్న వారి సమస్యలు పరిష్కారం కాకపోతే అసంతృప్తి పెరుగడం సహజం. అందువల్ల ప్రభుత్వం హామీలను ప్రకటనలకే పరిమితం చేయకుండా, అమలు ద్వారా విశ్వాసాన్ని పునరుద్ధరించాలి.
బాధితులు కార్యాలయాలకు వచ్చి అధికారులను కలువలేని పరిస్థితి ఉంటే, ఆన్లైన్ గ్రీవెన్స్ వ్యవస్థ, ప్రత్యేక హెల్ప్‌డెస్క్, ఫోన్ ద్వారా సమాచారం, వినతులపై ఎస్ఎంఎస్ లేదా ఇతర డిజిటల్ అప్డేట్లు అందించే పద్ధతులను బలోపేతం చేయవచ్చు. అయితే సాంకేతిక సదుపాయాలు అందుబాటులో లేని విశ్రాంత ఉద్యోగులకు ప్ర త్యక్ష సహాయం అందించే ఏర్పాట్లు కూడా అవసరం. ప్రభుత్వ కార్యాలయాల్లో భద్రత, ప్రజలకు అందుబాటులో ఉండే సేవలు రెండూ సమతుల్యంగా కొనసాగాలి. బాధితులకు కావాల్సింది హా మీ కాదు. తమకు రావాల్సిన సొమ్ముపై స్పష్టత, నిర్ణీత గడువు, ఆచరణలో కనిపించే చెల్లింపులు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, పెండింగ్ బిల్లులపై శ్వేతపత్రం విడుదల చేసి, నెలవారీ చెల్లింపుల కార్యాచరణ ప్రకటించి, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి.
బాధితులు కార్యాలయాలకు వచ్చి అధికారులను కలవలేని పరిస్థితి ఉంటే, ఆన్లైన్ గ్రీవెన్స్ వ్యవస్థ, ప్రత్యేక హెల్ప్‌డెస్క్, ఫోన్ ద్వారా సమాచారం, వినతులపై ఎస్ఎంఎస్ లేదా ఇతర డిజిటల్ అప్డేట్లు అందించే పద్ధతులను బలోపేతం చేయవచ్చు. అయితే సాంకేతిక సదుపాయాలు అందుబాటులో లేని విశ్రాంత ఉద్యోగులకు ప్రత్యక్ష సహాయం అందించే ఏర్పాట్లు కూడా అవసరం. ప్రభుత్వ కార్యాలయాల్లో భద్రత, ప్రజలకు అందుబాటులో ఉండే సేవలు రెండూ సమతుల్యంగా కొనసాగాలి.
తీగల అశోక్ కుమార్
9666634001
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

