తొలకరి
చుక్క కోసం నేల దాహం మట్టి పరిమళం ముక్కుపుటలు తాకే క్షణం
చుక్క కోసం
నేల దాహం
మట్టి పరిమళం
ముక్కుపుటలు తాకే క్షణం
గింజ
చెలికాడైన చుక్క కోసం
విరహ వేదనతో
మొలకెత్తాలనే తహతహ మది నిండా
కొమ్మల ఊయల్లో
చెట్టు పరవశం
ఆకుల సవ్వడి
మృదు సంగీత ధ్వని
నాగళ్ళు సాల్లల్ల
సల్లగా తిరుగుతుంటే
లేచిన మట్టి పెళ్ళ ఒళ్ళు విరుచుకుంది
కులుకుల నడకతో పైరు
వయ్యారం ఒలకబోసే వేళ
మడి కట్ల మెడలో పచ్చనిహారం
గలగల పారే ఒర్రె
ఒకింత వేదనతో వాగును చేరే
సేద తీరే తన ఉనికికో సార్థకం!
మోదుగు ఆకుల్ల
చింతొక్కుతో హంసన్నం
కురిసే చినుకుల మధ్య
చల్లారే జిహ్వ చాపల్యం
తొలకరిలో
ఒరాల మీద నడిచే
నాలుగు పాదాల ముద్రలు
ఏడడుగుల చేర్చే
పదనిసల పరువాలు
పదునైన బాసలు
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

