త్యాగచరిత
ఎన్ని జీవితాలు అమరత్వం పొందితేనో ఎన్ని ప్రాణాలు తృణప్రాయంగా త్యజిస్తేనో మన దేశం మనకు వశమై స్వేచ్ఛనివ్వలేదు
ఎన్ని జీవితాలు అమరత్వం పొందితేనో
ఎన్ని ప్రాణాలు తృణప్రాయంగా త్యజిస్తేనో
మన దేశం మనకు వశమై స్వేచ్ఛనివ్వలేదు
ఎన్ని పోరాటాలు త్యాగచరితం అయితేనో
ఎన్ని దండయాత్రలు దండుగా కదిలితేనో
స్వాతంత్య్రం మనకు స్వరాజ్యమై వెలగలేదు
ఆంగ్లపాలకుల దాష్టీకానికి
ఎదురొడ్డి నిలిచింది భారత పౌరుషం
వలసపాలకుల బానిసశృంఖలాలను
ఛేదించింది నవయవ్వన ప్రజానీకం
అప్రతిహతంగా సాగిన అహింసామార్గం
ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచిన చిరస్మరణీయఘట్టం
ఉప్పు సత్యాగ్రహ మహోద్యమ పోరాటం
అఖిల భారతావనిని ఏకంచేసిన స్వాతంత్య్రపోరాటం
ఒక మహాసంగ్రామాన్ని తలపింపజేసిన
భారత సమరయోధుల సమరత్వం
జాతీయ ఉద్యమాలకు నాంది పలికిన
యువకిశోరాల ధృడమైన వీరత్వం
మహోన్నత వందేమాతర నినాదం
దేశమంతటినీ ఒక్కటిచేసిన స్ఫూర్తిమంత్రం
చంపండి లేదా చావండి అన్న సందేశం
జాతిని జాగృతపరిచిన విజయకేతనం
అమరుల త్యాగఫలమే నేటి స్వాతంత్య్రం
డెబ్బదిఏండ్ల అమృతోత్సవమే ఈ స్వరాజ్యం
– డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
9032844017
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

