విరుగుతున్న కల!
ఆకుపచ్చని కల ఇక్కడ అన్వయమెరుగని పద్యమైంది కత్తి దూస్తున్న కరువు చిత్రం ఫీనిక్స్ పక్షిలా పైకి లేస్తున్నది!
ఆకుపచ్చని కల ఇక్కడ
అన్వయమెరుగని పద్యమైంది
కత్తి దూస్తున్న కరువు చిత్రం
ఫీనిక్స్ పక్షిలా పైకి లేస్తున్నది!
నేల నేలంతా
నెర్రలు వారిన నైరూప్య చిత్రమైంది
తేమ లేని గాలి వదలుతున్నది అగ్ని శ్వాస!
జీవనదుల జాలి చూపు ఎదలో
భయం విత్తులు నాటుతున్నది
తరుముకొస్తున్న ఆకలి దృశ్యాలు
యుద్ధాల కంటే భయంకరమైనవి!
నగరాల నాలుక పిడుచ కట్టుకపోతే
కాలాన్ని నిందించడం తప్ప
కమ్ముకొచ్చే కటిక చీకట్లను కాదనలేం!
వట్టి మాటలతో కాలం
కండ్లు కప్పుతున్న ఏలికలకు
ఎచ్చులకేం తక్కువ లేదు
అన్నింటికీ గతం మీదే నింద!
దశాబ్ద కాలంగా
మూడు కాలాలు తడి నేల మీద
తిరుగాడిన పాదాలు
ఆగ్రహిస్తే అనల జ్వాలలే!!
– కోట్ల వెంకటేశ్వర రెడ్డి
94402 33261
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

