బంగారు తెలంగాణ
రెండువేల పద్నాలుగు జూన్ రెండు తెలంగాణ తల్లికి విముక్తి మెండు నాలుగుకోట్ల జన గుండెల నిండా రత్నాల వీణల మోగిన దండు
పల్లవి: రెండువేల పద్నాలుగు జూన్ రెండు
తెలంగాణ తల్లికి విముక్తి మెండు
నాలుగుకోట్ల జన గుండెల నిండా
రత్నాల వీణల మోగిన దండు
చ: బంగారు తెలంగాణకు బాటపడింది
భవిష్యత్ మీద ఆశ కలిగింది
కేసీఆర్ మనకు సీయం అయ్యిండు
సంక్షేమ ఫలాలు సమృద్ధిగిస్తుండు
చ: సమగ్ర సర్వేనే సాక్షమయ్యింది
సకల జనులంత సంతోసించిండ్రు
అవసాన దశలోని అవస్థలు చూసి
ఆసరాగుంటానని అభయమిచ్చిండు
చ: ఆ ఆసరా పథకమే ఆశాదీపమై
ముసలోళ్లకెంతో ఉశారునిచ్చింది
తల పాగా చెరువులు తళతళ మెరిసి
ఊరూర చెరువులు జల కళతెచ్చినవి
చ: తెలంగాణ చెల్లికి మనసున్న అన్నగా
అపర పురుషోత్తముడై ఆదుకున్నాడు
కల్యాణలక్ష్మికి అక్షింతలు వేసి
ఆడబిడ్డల తండ్రికి దేవుడయ్యిండు
చ: అంగన్వాడికి బంగారమయ్యి
బతుకమ్మ పండుగకు బలమెంతో ఇచ్చిండు
తెలంగాణ తల్లికి బంగారు కొడుకై
భారతదేశానికి పేరు తెస్తుండు
– వాకిటి రామ్రెడ్డి
90007 02093
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

