ఊరేగుతున్న పరాభవ రుచి!
నీటికి ఆత్మగౌరవం ఎక్కువ జారవిడుచుకుంటే అవి వెనక్కి మళ్లి చూడవు!
నీటికి
ఆత్మగౌరవం ఎక్కువ
జారవిడుచుకుంటే
అవి వెనక్కి మళ్లి చూడవు!
పాలమూరు పొలాలు
దాహంతో విలవిల్లాడుతుంటే
ఇంగితం కోల్పోయినందుకు
పైవాడితో కాళ్ల బేరం!
కాలం
ఒక వైపు కన్నెర్రజేస్తుంటే
పట్టింపు కరువైన పాలన
జనం లోపల హేళన!
అతిథైన విద్యుత్తు
రాకపోకల మర్మమెరుగక
ఆందోళనలో అన్నదాత భవిష్యత్తు!
కరువు
రుచి ఎరిగిన వాడిగా చెప్తున్న
రాబోయే కాలం
యుద్ధానంతర దృశ్యమే!
నీళ్లు మనవే
పరాయి పొలాలలో పరవశిస్తుంటే
మా లోపలి దుఃఖానికి
ఈ నలుపు రంగు సరిపోదు!
ఏవేవో ఇస్తానంటే చేస్తానంటే
ఊహకు మించి
మద్దతిచ్చిన వాళ్లున్నరు
చూస్తూ ఊరుకుంటారా?
గమనించడం లేదా
యుద్ధం రాకముందే
మీ పరాభవ రుచి
ఊరూరా ఊరేగుతున్నది!
కోట్ల వెంకటేశ్వరరెడ్డి 9440233261
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించాలి’
Health tips | చద్దన్నంతో ఎన్నో ప్రయోజనాలు.. ఛీ చద్దన్నం అని చీప్‌గా తీసిపారేయకండి..!
‘రాచకొండ ఎత్తిపోతల పథకంతోనే నారాయణపురం మండలానికి శాశ్వత సాగునీరు’
ENE Repeat Trailer | ‘ఈ నగరానికి ఏమైంది 2’ ట్రైలర్ విడుదల.. నలుగురు స్నేహితుల సందడి ఈసారి మరింత గ్రాండ్‌గా!
Vishwambara | చిరంజీవి ‘విశ్వంభర’ ఆలస్యానికి అసలు కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

