మాటల కోటలు
మాటల మట్టి పెళ్ళలతో బీటలువారే కోటలు కట్టే మైమగల్ల మారాజులెందరో, మైమరిచే ముచ్చట్లు జెప్పి మరిచే యువరాజులెందరో?!
మాటల మట్టి పెళ్ళలతో
బీటలువారే కోటలు కట్టే
మైమగల్ల మారాజులెందరో,
మైమరిచే ముచ్చట్లు జెప్పి
మరిచే యువరాజులెందరో?!
రాచవీధిలో షికారుకెళ్ళెటోళ్ళకు
మురికివాడల్లో ఏం పనివడ్డదో?
అభివృద్ధి పట్టాలేయడానికో
వాళ్ళ కలల సాకారానికో?!
ఫైవ్‌స్టార్ హోటల్లో
ఇరానీ చాయ్ జుర్రేటోళ్ళు
చౌరస్తాలో చాయ్ గాస్తున్నరెందుకో
తేనీటి విందివ్వడానికో,
తేనెటీగలా కుట్టడానికో?!
నవరసాలన్నీ ఒక్కచోట నాట్యమాడుతుంటే,
ఏ రసానికి స్పందించాలో తికమక!
పంచ్ డైలాగులతో ఉడికెత్తిస్తుంటే
ఎవరికి ఈల వేయాలో మకతిక!!
ఇన్నిరోజులు
మా కష్టాల కథ చెప్తుంటే
ప్రేక్షకులై కామెడీ సిన్మా జూసిండ్రు!
గిప్పుడు మా కథ మాకే
మాకన్న మస్తుగ జెప్తుండ్రు!!
పబ్బతి వట్టి ప్రాధేయపడ్డా
కనికరించని కరుణామయులు
కరములు జోడించి
కడుపుల తలవెడ్తుండ్రు!
ఎవరి పబ్బం గడవడానికో!!
నిన్నటిదాకా ఈసడించుకున్నోళ్ళే
‘బంధు’వులమంటూ సుట్టిర్కం!
మా‘నవ కుల’మంతా ఒక్కటౌతుంటే,
వేరు చేసి నీరు పోయవట్టె!
కోట్లకొద్దీ నోట్లను పంచుతూ
నోట్లో మట్టిగొట్టే ఓట్లెందుకొచ్చినై?
డబ్బు మబ్బుల్లో తడిసి,
మద్యం నదుల్లో మునిగి,
హామీల అలల్లో తేలి
ఓటమిని ఒప్పుకొంటవో,
ఒడిశెల ఓటెట్టి తిప్పికొడ్తవో!!
– గంగాపురం శ్రీనివాస్ 96763 05949
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

