నింగిలోని దేవతలు అచ్చెరు వొందగా నిప్పు రవ్వలు విరజిమ్ముతూ చంద్రుడి పై కాలు మోపగా 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను మోసుకుని మింటి కెగసింది చంద్రయాన్ – 3 రాకెట్టు దేశం గర్వించదగ్గ ఇస్రో శాస్త్ర వేత్తలు రాత్రనక పగలనకా పరిశోధనలు చేసి వెన్నెల రేడు సంపద వెలికి తీయడానికి నిర్మించిన చంద్రయాన్ -3 రాకెట్టు రై రై మంటూ జాతీయ జెండాను చందమామపై సగర్వంగా నిలిపింది సాటిలేని విజయాన్ని సొంతం చేసుకుంది ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకుని ఔరా అంటూ భారత్ వైపు నివ్వెరపోయి చూస్తున్నారు భారతీయుల గుండెలు పట్టపగ్గాలు లేకుండా గర్వంతో ఉప్పొంగి పోతున్నాయి చంద్రయాన్ 3 విజయం ఒక మహోన్నత చారిత్రక ఘట్టం భరతమాత కీర్తి కిరీటంలో మణిహారం జయహో చంద్రయాన్ జయహో ఇస్రో శాస్త్రవేత్తలు జయహో భారత్.