గోదావరీ ప్రదక్షణం..

ఒక మహనీయ లోచన మహోన్నత ప్రాభవమై గభీరమై,
ప్రకటిత చంద్రశేఖర సుభాగ్యవతంసమునై శుభంబునై,
సకల జనావళీ ముదిత సాగరమై జలదృశ్యమై తగన్,
చకచక సాగు నీటి కథ సాగును నీ తెలగాణ గడ్డపై..
తాతల బూదిపై తడపంగ ఆగంగ
పారంగజేసె భగీరథుండు
తెలగాణ మాగాణ పొలముల తడపంగ
జేయంగనా చంద్రశేఖరుండు
ఆ చంద్రశేఖరుడా నాడు ప్రీతిమై
అమర గంగను భువికందజేసె
ఈ చంద్రశేఖరుడీ నాడు
పాతాళ గంగను పైకి సాగంగ జేసె
నీరు పల్లమెరుగు నిన్నటిదామాట
పాటిగాదు నదియు సాటిగాదు
ఎగసి ఎగసి పరువులెత్తును, పైపైకి
నీరు పారుటన్న నేటి మాట..
కాళేశ్వరము నుండికైపెక్కి పైకెక్కి
కొండపోచమ్మ కడకొంత ఆగి
మల్లన్నసాగరమందున తాజేరి
మరలి వాగులు చెరువార నింపి
పస్పుటేరున జేరిపారుచు మంజీర
పాదాల నాదాల పరవశించి
ఆ నిజాం సాగరునానందడోలల
మురిపించి మురిపించి ముంచి తేల్చి
దక్షణ తెలగాణ దాక్షిణ్యమునతా, ప్ర
దక్షణ మునుసరిగ తానొనర్చి
ఎన్ని చేనుచెల్కలెన్న పంట పొలాలొ
ముద్దు ముచ్చటలను ముంచినావొ….
ఎక్కడి గోదావరి నది
ఎక్కెను పైపైకి ఎంతొ ఎత్తుకుపారెన్
చక్కని కాళేశ్వరమై
మక్కువ మంజీరకెంతొ మాన్యత గూర్చెన్..
ఎంతో ఎత్తుకు ఎదిగిన
సుంతైనను తొట్రుపాటు చూపవుగా, ని
న్నింతగ పెంచిన ఆ మతి
మంతుగుణములెన్న గతరమగునే మాకున్…

శాస్ర్తుల రఘురామశర్మ
94402 40881
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

