అందాల బొమ్మ నభా నటేశ్కు బొమ్మలు గీయడం అంటే ఇష్టం. అలవోకగా క్యాన్వాస్ మీద రంగుల లోకం సృష్టించగలదు. తన అభిమాన నటుడు చార్లీ చాప్లిన్. ‘ఆయన జీవితం, నటన.. తెర మీద, తెర వెనుక నాకెంతో స్ఫూర్తినిచ్చాయి.
ఆ మహానటుడికి నివాళిగా ఓ పెయింటింగ్ గీయాలని నిర్ణయించుకున్నా. షూటింగ్లేని ఖాళీ సమయంలో ఇదిగో ఈ చిత్రానికి ప్రాణం పోశాను’ అంటూ తను గీసిన బొమ్మను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసింది. సూపర్!