తొలిచూరు ఆడబిడ్డ
తెలంగాణ బతుకమ్మ చరిత్ర గురించి చెప్పాలంటే- తెలంగాణ తొలిచూరు ఆడబిడ్డ మన బతుకమ్మ ఆశ్వయుజమాసంలో ఆడబిడ్డలందరూ ఎంతో సంబురంగా ఆడుకునే ఆట మన బతుకమ్మ పండుగ. మన పండుగల్లో పెద్దపండుగ మన బతుకమ్మ.
తెలంగాణ బతుకమ్మ చరిత్ర గురించి చెప్పాలంటే- తెలంగాణ తొలిచూరు ఆడబిడ్డ మన బతుకమ్మ ఆశ్వయుజమాసంలో ఆడబిడ్డలందరూ ఎంతో సంబురంగా ఆడుకునే ఆట మన బతుకమ్మ పండుగ. మన పండుగల్లో పెద్దపండుగ మన బతుకమ్మ. తంగేడు, గునుగు పూలతో పాటు తీరొక్క పూలతో బతుకమ్మను తొమ్మిది రోజులు ఎంతో సంబురంగా ఆడుకుని తొమ్మిదో రోజున గంగమ్మకు అర్పిస్తాం.
బతుకమ్మ పాట గురించి చెప్పాలంటే ఆ పాటలు దేవీ దేవతల మహిమలు, రాజుల గాథలు, అత్తా కోడళ్ళ సంవాదం, భార్యాభర్తల అనురాగం, అన్నాచెల్లెళ్ల ఆప్యాయతలు, ఆడబిడ్డల సుఖదుఃఖాలు, ఇలా రకరకాల విజయగాథలు, రాజుల వీరగాథలు, పాడుకుంటూ సంబురపడి పోతాము. అలాంటి పాటలు అమ్మమ్మ, నానమ్మల కాలంనుండి నేర్చుకుని పాడుకుంటూ బతుకమ్మని కీర్తిస్తూ సంబురపడి పోతాము. బతుకమ్మకు నెయ్యి, పెసరపప్పుతో పాటు రకరకాల పిండివంటలు నైవేద్యంగా సమర్పించి ఆడుకున్నాక చెరువు వద్దకు వచ్చి బతుకమ్మతో పాటు ఆ నైవేద్యాల్ని గంగమ్మకు కూడా కొంత సమర్పించి ఆ తర్వాత అందరం ఒకరికొకరు పంచుకుని తింటూ సంబురపడి పోతాం. ఇక తిరిగి వస్తూ కూడా ఇంటి వరకూ పాటలుపాడుకుంటూ సంబురపడి పోతాము.
(అక్షరయాన్ సౌజన్యంతో)
కమలావతి దేవి ఉయ్యాల పాట- మొట్టమొదట పాడుతాం
శ్రీగణనాథుని ఉయ్యాలో – సేవించి మదిలోన ఉయ్యాలో
శ్రీజగదాంబకు ఉయ్యాలో – సేవించుమ్రొక్కెదను ఉయ్యాలో
ఆదిత్రిమూర్తుల ఉయ్యాలో – ఆత్మలోవేడెదను ఉయ్యాలో
కలియుగమందున ఉయ్యాలో – కన్నతల్లిదండ్రులు ఉయ్యాలో
తలచితిని మదిలోన ఉయ్యాలో- తత్వంబుగైకొని ఉయ్యాలో
నాగభటులనమ్మి ఉయ్యాలో – నమ్మితిని శ్రీయరిని ఉయ్యాలో
నవ్వు నవెదరు ఉయ్యాలో – నరులెల్ల మిడికేరుచు ఉయ్యాలో
పాట పాడెదనుచు ఉయ్యాలో – ప్రజలెల్ల మిడికేరు ఉయ్యాలో
పాటెంత కష్టంబు ఉయ్యాలో – పరమాత్మునికెరుక ఉయ్యాలో
నవ్వెంత నష్టంబు ఉయ్యాలో – నారాయణుని కెరుక ఉయ్యాలో
సత్య కేతు రాజు ఉయ్యాలో – సత్యవంతుడమ్మ ఉయ్యాలో
ఆతనికి ఒక బిడ్డ ఉయ్యాలో- అందమైన బాల ఉయ్యాలో –
ఈ పాటలో లగ్గం చేశాక పిల్లను అప్పచెప్పే తీరు, తల్లిదండ్రుల్ని విడిచి పెట్టలేక బాధపడే తీరుతో పాట ముగుస్తుంది. ఇంకా చెప్పాలంటే ఉదా- ‘తూర్పు దిక్కున ఉయ్యాలో- తులసి వానలు కురిసే ఉయ్యాలో, పడమటి దిక్కున ఉయ్యాలో-పాల వానలు కురిసే ఉయ్యాలో’అన్నపాట చెరువు నిండినప్పుడు పాడుకుంటారు. ‘శ్రీ లక్ష్మీ నీ మహిమలు చిత్రమై తోచునంట అన్నపాట, చిత్తుచిత్తుల బొమ్మ- శివుని ముద్దుల గుమ్మ అన్నపాట, మా అన్న లొచ్చిండ్రు మమ్మంపుతార అన్నపాట, జనకు జనకు నింట్ల, అన్న సీతమ్మ పాట ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ఆడపిల్లల నోళ్ల నుంచి తీగలాగ సాగుతూనే ఉంటా యి. మళ్ళొచ్చేఏటికి మళ్లీ రావమ్మా అని పాడుతూనే బతుకమ్మకి వీడ్కోలు పలుకుతాము.
వై. సుజాత ప్రసాద్
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

