పెరూ తీర్పు

పెరూలో హోరాహోరీగా సాగిన ఎన్నికలలో వామపక్షవాది పెడ్రో కాస్టిల్లో విజయం ఖరారయిపోయింది. ఫలితాలను అధికారికంగా ప్రకటించనప్పటికీ విదేశాల నుంచి ఆయనకు అభినందనలు అందుతున్నాయి. లాటిన్ అమెరికాలో ఇటీవలి పరిణామాలు, రెండు విరుద్ధ శక్తుల మధ్య పోటీ జరగడం వల్ల ఈ ఎన్నికల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమైంది. నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల బరిలో నిలిచిన కీకో ఫుజిమోరి, పెడ్రో కాస్టిల్లో విరుద్ధ ధృవాల ప్రతినిధులు. కీకో ఫుజిమోరి ప్రైవేటీకరణ విధానాల ప్రతినిధిగా ఎన్నికల బరిలో నిలిచారు. ఆమె సంపన్నవర్గాల ప్రతినిధి. అవినీతికి పాల్పడి జైలు పాలయిన మాజీ అధ్యక్షుడు ఆల్బర్టో ఫుజిమోరి కుమార్తె, రాజకీయ వారసురాలు. ఈమెకు కూడా అవినీతి ఆరోపణలతో జైలు పాలయిన చరిత్ర ఉన్నది. పెడ్రో కాస్టిల్లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. పల్లె ప్రాంతాలలోని పేదవర్గాలలో మద్దతు ఉన్నది. సామ్యవాద ఆర్థిక విధానాలను అమలు చేస్తానని ప్రకటించారు.
ప్రపంచీకరణ మొదలైన తరువాత ఆయా దేశాలు అనుసరించిన ఆర్థిక విధానాల వల్ల లాటిన్ అమెరికన్ సమాజం ఎంతో సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. ప్రస్తుతం కరోనా ప్రభావం కూడా ఈ దేశాలపై తీవ్రంగా ఉన్నది. స్వేచ్ఛా ఆర్థిక విధానాల స్థానే సంక్షేమ విధానాలు ఉండాలనే భావన బలపడుతున్నది. ఈ నేపథ్యంలో ఇటీవలి ఎన్నికలలో అర్జెంటీనా, మెక్సికో, వెనిజులా, బొలీవియా దేశాలలో వామపక్షాలు అధికారానికి వచ్చాయి. ఇప్పుడు పెరూలోనూ అదే పరిణామం కనబడుతున్నది. త్వరలో ఎన్నికలు జరిగే చిలీ, కొలంబియా, బ్రెజిల్ దేశాలలో కూడా వామపక్ష శక్తులు అధికారం చేపట్టే పరిస్థితులు ఉన్నట్టు భావిస్తున్నారు. గతంలో 1998లో వెనిజులాలో హ్యుగో చావెజ్ ఎన్నికైన తరువాత ఈ శతాబ్దారంభంలో లాటిన్ అమెరికా దేశాలలో ‘గులాబీ ప్రభంజనం’ కనిపించింది.
ఇల్లు అలుకగానే పండగయినట్టు కాదు. పెరూలో ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రశాంత పాలన సాగుతుందని చెప్పలేని పరిస్థితి ఉన్నది. గనులను జాతీయం చేయాలని, ప్రైవేటీకరణ విధానాలకు స్వస్తి చెప్పాలని యువత డిమాండ్ చేస్తున్నది. వాస్తవానికి యువత సాగిస్తున్న ఉద్యమం మూలంగానే కాస్టిల్లో విజయం ఖాయమైంది. మరోవైపు లాటిన్ అమెరికా దేశాలను అస్థిరం చేయడం అమెరికాకు పరిపాటి. అందువల్ల అంతర్జాతీయ పరిస్థితులను, దేశ ప్రజల డిమాండ్లను గమనంలోకి తీసుకోవలసి ఉంటుంది. పెరూ పరిస్థితి అగ్నిపర్వతం మాదిరిగా ఉన్నది. అందువల్ల శాంతి స్థాపనకు, ప్రజల మధ్య సామరస్యానికి కొత్త అధ్యక్షుడు కృషి చేయవలసి ఉంటుంది. నూతన ఆర్థిక విధానాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతున్న నేపథ్యంలో పెరూతో పాటు లాటిన్ అమెరికా రాజకీయాలపై ఆసక్తి వ్యక్తమవుతున్నది.
Read Today's Latest Editorial News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

