స్మార్ట్ క్లీనర్!

ఫోన్లు, వాచీలే కాదు.. వ్యాక్యూమ్ క్లీనర్లూ స్మార్ట్‌గా తయారవుతున్నాయి. కరోనా భయంతో పని మనుషులను ఇంట్లోకి రానివ్వలేని పరిస్థితుల్లో.. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుతున్నాయి. స్మార్ట్ ఫోన్ ద్వారానే యజమాని ఆదేశాలను అందుకొని.. ఇంటి దుమ్మును దులిపేస్తున్నాయి. గతంలో.. ‘వ్యాక్యూమ్ క్లీనర్ వాడేకన్నా.. చీపురుతో ఇంటిని శుభ్రం చేసుకోవడం మేలు’ అనుకొనేవాళ్లు. కానీ, అందివస్తున్న ఆధునిక సాంకేతికతతో వ్యాక్యూమ్ క్లీనర్లు మరింత స్మార్ట్‌గా మారిపోయాయి. వీటి ముందుభాగంలో ఉండే కెమెరా.. ఇంట్లో ఎక్కడ చెత్తాచెదారం ఉన్నా పసిగట్టేస్తుంది. వెంటనే అక్కడికి వెళ్లి.. వాటి పని పడుతుంది. వీటిని స్మార్ట్ ఫోన్లతోనూ అనుసంధానం చేసుకోవచ్చు. మనం ఎక్కడ ఉన్నా.. ఫోన్ నుంచే వ్యాక్యూమ్ క్లీనర్‌కు ఆదేశాలు ఇవ్వొచ్చు. అంతే.. మనం తిరిగి వచ్చేసరికి ఇంటి మొత్తాన్నీ శుభ్రం చేసేస్తాయివి. ఇంట్లో వాళ్లకు ఇబ్బంది కలుగకుండా, తమ పనిని నిశ్శబ్దంగా కానిచ్చేస్తాయి. ఇందుకోసం ‘సైలెన్స్ మోడ్’ను ఎంచుకొంటే సరి. ముందుగానే ‘క్లీనింగ్ టైమ్’ను సెట్ చేసుకొంటే.. సమయానికి తగ్గట్టు ఇంటిని శుభ్రం చేస్తాయి. ఇప్పటికే అనేక సంస్థలు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో పనిచేసే స్మార్ట్ వ్యాక్యూమ్ క్లీనర్లను రూపొందిస్తున్నాయి.
Read Today's Latest Earnings News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

