సినీనటుడు పోసాని కృష్ణమురళి ఇంటిపై దుండగుల రాళ్లదాడి

వెంగళరావునగర్ : సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇంటి పై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరి పారిపోయారు. బుధవారం ఆర్ధరాత్రి 2 గంటల సమయంలో ఎల్లారెడ్డిగూడలోని పోసాని ఇంటి పై ఇటుకలు, రాళ్లతో దాడి చేయడంతో పాటు పోసాని, ఆయన భార్యను తీవ్ర పదజాలంతో దూషించినట్లు ఇంటి వాచ్మెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎల్లారెడ్డిగూడలో పోసానికి సొంత ఇల్లు ఉంది. అయితే గత 8 నెలల క్రతమే ఆయన మణికొండకు మారారు. ఖాళీగా ఉన్న ఇంటిని చూసుకునేందుకు యాకయ్య, శోభ అనే దంపతులను కాపలాదారులుగా ఉంచారు. ఈ క్రమంలో పోసాని ఇంట్లోనే ఉన్నాడని భావించిన అగంతకులు ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.

రెండు రోజుల క్రితం కూడా గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వెళుతూ గట్టిగా దుర్భాషలాడుతూ వెళ్లారని వాచ్మెన్ తెలిపారు. బుధవారం రాత్రి జరిగిన సంఘటనలో బైక్ పై ఇద్దరు వ్యక్తులు వచ్చారు, తమను కొడతారనే భయంతో తాము బయటకు రాలేదని వాచ్మెన్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాడి సమాచారాన్ని పురుషోత్తం అనే వ్యక్తికి ఫోన్ చేసి చెప్పడంతో ఆయన పోలీసులకు సమాచారం అందించాడు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి వద్ద భద్రతను కల్పించారు. దర్యాప్తులో భాగంగా పోసాని ఇంటి సమీపంలోని సీసీ టీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. వాచ్మెన్ యాకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC | జాయింట్ పాస్ చిచ్చు..! ‘ఆర్టీసీ, మెట్రో’ ఒకే పాస్ నెలకు రూ.8,500పై ప్రయాణికుల గరం
ఎల్ఆర్ఎస్ అధికారి కనిపించడం లేదు.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Ram Charan | ‘ఆర్సీ 17’లో నాయికగా సాత్విక వీరవల్లి ?
Sanjay Gupta | బాలీవుడ్ దర్శకనిర్మాత సంజయ్‌గుప్తా కన్నుమూత
Tharun Bhascker | కొత్త మిషన్‌తో తిరిగొచ్చారు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

