Jeevandan | కానిస్టేబుల్ వీరబాబుకు ఘన నివాళి

కొండాపూర్: తాను మరణిస్తూ మరో 5 మందికి ప్రాణదాతగా నిలిచిన కొండాపూర్‌లోని 8వ పోలీసు బెటాలియన్ కానిస్టేబుల్ వీరబాబుకు నివాళిగా గురువారం బెటాలియన్ కమాండెంట్ పీ మురళీ కృష్ణ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ ఈ నెల 12 న వీరబాబు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి దవఖానలో చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్ళాడని, బ్రెయిన్‌డెడ్ అయిన ఆతని కుటుంబ సభ్యుల అంగీకారంతో వీరబాబు అవయవాలను అత్యవసర పరిస్థితులలో ఉన్న మరో 5 మందికి అందజేసి ప్రాణాలు కాపాడారన్నారు.
మరణంలోను మరో 5 కుటుంబాల్లో సంతోషాన్ని నింపిన వీరబాబు ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. విధులలో ఉత్తమ ప్రతిభ కనబర్చే వీరబాబు సేవలను కొనియాడారు. అనంతరం వీరబాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ టీ గంగారం, అసిస్టెంట్ కమాండెంట్లు, బెటాలియన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

