Fb fraud | అత్యవసరంగా డబ్బులు కావాలని స్నేహితుడి నుంచి మెసేజ్.. తీరా డబ్బులు పంపాక..

బంజారాహిల్స్ : అత్యవసరంగా డబ్బులు అవసరం ఉందంటూ స్నేహితుడి పేరుతో ఫేస్బుక్ మెసెంజర్లో వచ్చిన సందేశాన్ని నమ్మి రూ.40వేలు పంపించి మోసపోయిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జూబ్లీహిల్స్ రోడ్ నెం 70లోని జర్నలిస్టు కాలనీలో నివాసం ఉంటున్న పూసపాటి లక్ష్మీపతిరాజు అనే వ్యాపారికి గత నెల 24న ఫేస్ బుక్ మెసేంజర్‌లో స్నేహితుడు విష్ణువర్దన్ పేరుతో సందేశం వచ్చింది. తనకు అర్జెంట్‌గా రూ.20వేలు కావా లని. వెంటనే ఫోన్‌పే ద్వారా తాను సూచించిన నెంబర్‌కు పంపించాలని కోరాడు. దాంతో అతడు చెప్పిన విధంగా లలిత్ కుమార్ అనే వ్యక్తిపేరుతో ఉన్న ఫోన్ నెంబర్‌కు పంపించాడు.
కాసేపటికి డబ్బులు రాలేదని, మరోసారి పంపించాలని కోరగా మరో రూ.20వేలు పంపించాడు. అవి కూడా రాలేదని చెప్పడంతో అనుమానం వచ్చి ఆరా తీయగా విష్ణువర్దన్ పేరుతో ఫేస్బుక్లో బోగస్ అకౌంట్ క్రియేట్ చేసినట్లు తేలింది. ఈ మేరకు బాధితుడు మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Akvan | దూసుకొస్తున్న ‘అక్వాన్’.. మహబూబాద్ భద్రాచలం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు
JNTU Professor Jobs | 30 లక్షలకో ప్రొఫెసర్ పోస్టు.. జేఎన్టీయూలో అక్రమ వసూళ్ల పర్వం!?
Bullet Train | బుల్లెట్ రైలు పేరుతో భూముల వేట.. 1,100 ఎకరాలపై రేవంత్ సర్కార్ కన్ను!
Crop Bonus | ధాన్యం రైతుకు యాప్ దగా.. బోనస్ ఎగవేతకు సర్కార్ ఉద్దేశపూర్వక జాప్యం
సాగర్‌కు ఏపీ కన్నం.. రిజర్వాయర్ నుంచి నేరుగా టన్నెల్.. తాగునీటి ముసుగులో జలదోపిడీకి స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

