Hyderabad Cyclists Group | సైకిల్ రైడింగ్‌తో ఆరోగ్యానికి మేలు

శంషాబాద్ రూరల్: సైకిల్ రైడింగ్ ఆర్యోగానికి ఎంతో మేలు చేస్తుందని హైదరాబాద్ సైకిలిస్ట్ గ్రూప్ వ్యవస్థాపకుడు రవీందర్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుచిత్ర నుంచి శంషాబాద్ మండలంలోని నర్కూడ అమ్మపల్లి దేవాలయం వరకు 100 కిలోమీటర్ల దూరం సైకిల్ రైడింగ్ చేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకుడు రవీందర్ మాట్లాడుతూ హైదరాబాద్ సైకిల్ గ్రూప్ 2017లో స్థాపించామని, నేటికి కొనసాగిస్తున్నట్లు వివరించారు. ప్రతి ఒక్కరు కనీసం వారంలో ఒక్కరోజు సైకిల్ తొక్కితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు.

ఒక్కరితో ప్రారంభమైన తమ గ్రూపు నేడు పదివేల మంది వరకు సైకిల్ రైడ్ చేస్తున్నట్లు చెప్పారు. సైకిల్ రైడ్ చేయడంతో గుండెతో పాటు శారీరంలోని అన్ని విభాగలకు రక్తప్రసరణ జరిగి ఆరోగ్యంగా ఉంటారని గుర్తు చేశారు. హైదరాబాద్ నగరంలోని ప్రతి ఒక్కరూ వారంలో ఒక్కరోజైన సైకిల్నడిపి ఆరోగ్యంగా ఉండాలనే మా గ్రూపు లక్ష్యమని తెలిపారు. ప్రతి ఆదివారం హైదరాబాద్ నుంచి చుట్టు పక్కల 100 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి తిరిగి వస్తామని వివరించారు. ఈ ఆదివారం సుచిత్ర నుంచి శంషాబాద్‌లోని అమ్మపల్లి దేవాలయం వరకు 90 మంది సభ్యులతో వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి వెళ్తున్నట్లు చెప్పారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

