జూబ్లీహిల్స్ : బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు వడ్డెర ఓబన్న అని ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పేర్కొన్నారు.
మంగళవారం రహ్మత్‌నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్‌లోని వడ్డెర ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన వడ్డే ఓబన్న జయంతి వేడుకలలో పాల్గొని కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, ఐక్య వేదిక అధ్యక్షులు యాదయ్యతో కలిసి ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
వడ్డెర జాతికి ఆశాజ్యోతి లాంటి ఓబన్న చిరస్మరణీయుడని పేర్కొంటూ ఆయన జయంతి పురస్కరించుకుని నేతలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మహ్మద్ మన్సూర్, కార్యదర్శి భాస్కర్‌తో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.