అబిడ్స్ : కింగ్ కోఠి దవాఖానా ప్రాంతంలో ఓ భారీ వృక్షం కూలి పోయింది. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలతో భారీ వృక్షం కుప్పకూలింది. దీంతో పరిసర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. సకాలంలో అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. విద్యుత్ శాఖాధికారులు విద్యుత్ సరఫరాను పునరుద్దరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకు న్నారు. జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వృక్షాన్ని ముక్కలు చేసి తరలించారు.
భారీ వృక్షం కూలడంతో పరిసర ప్రాంతాలలో వాహనాల రాక పోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించి రోడ్డుకు అడ్డంగా పడిన వృక్షం కొమ్మలను తొలగించే పనులను పర్య వేక్షించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సకాలంలో స్పందించి రోడ్డుకు అడ్డుగా పడిన చెట్టు కొమ్మల తొలగింపు పనులను త్వరితగతిన చేపట్డడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.