ఆయుధ పూజ ఎందుకంటే..
శరన్నవరాత్రులలో నవమి (మహర్నవమి) నాడు చేసే విశిష్ట కార్యక్రమం ఆయుధ పూజ. ఆనాడు అమ్మ వారు మహిషాసుర సంహారం చేసిందని పురాణాలు చెబుతున్నాయి. దుష్టరాక్షసుల వల్ల కలిగే బాధలు భరించలేక దేవతలందరూ అమ్మవారికి మొర పెట్టుకున్నారు. రక్షించమని వేడుకున్నారు. అమ్మవారిని ఆరాధిస్తూ ఒక మహాద్భుతమైన యజ్ఞం చేశారు. తమ తమ ఆయుధాలను అన్నిటినీ ఆ యజ్ఞ కుండంలో సమర్పించారు.
మహర్నవమి నాడు ఆయుధ పూజ ఎందుకు చేస్తారు?
-దత్తు, తూప్రాన్
శరన్నవరాత్రులలో నవమి (మహర్నవమి) నాడు చేసే విశిష్ట కార్యక్రమం ఆయుధ పూజ. ఆనాడు అమ్మ వారు మహిషాసుర సంహారం చేసిందని పురాణాలు చెబుతున్నాయి. దుష్టరాక్షసుల వల్ల కలిగే బాధలు భరించలేక దేవతలందరూ అమ్మవారికి మొర పెట్టుకున్నారు. రక్షించమని వేడుకున్నారు. అమ్మవారిని ఆరాధిస్తూ ఒక మహాద్భుతమైన యజ్ఞం చేశారు. తమ తమ ఆయుధాలను అన్నిటినీ ఆ యజ్ఞ కుండంలో సమర్పించారు. వారి భక్తికీ, సమర్పణ భావానికీ మెచ్చి అమ్మవారు మహిషాసుర మర్దినిగా, శక్తిస్వరూపిణిగా ఆవిర్భవించింది. వారు సమర్పించిన అన్ని ఆయుధాలనూ చేతులలో ధరించి సాక్షాత్కరించింది. వారి కోరిక మేరకు రాక్షస సంహారం చేసి, దేవతలకు సుఖశాంతులను అనుగ్రహించింది.
ఈ పురాణకథ నేపథ్యంలో ఆయుధపూజ చేసే సంప్రదాయం వాడుకలోకి వచ్చింది. అయితే ఆయుధాలు అంటే కేవలం మారణాయుధాలు కాదు. నిత్యం తమ తమ విధ్యుక్త ధర్మాలను నిర్వర్తించటానికి అన్ని తరగతుల ప్రజలూ వినియోగించే పరికరాలన్నీ ఆయుధాలే. ఈ ఉపకరణాలు అమ్మ చేతి ఆయుధాలు అనీ, అవి కేవలం జడపదార్థాలు కాదనీ, వాటిపై మనకు అధికారం లేదనీ అమ్మవారి అనుజ్ఞ మేరకు వాటిని లోక కల్యాణానికీ, విశ్వశ్రేయస్సుకీ, సామాజిక అభ్యుదయానికీ అనువుగా సమర్పణ భావంతో వినియోగించాలని మనకు సందేశం ఇవ్వడానికే ఈ ఆచారం ఏర్పడింది. అంతేకాదు, అవి మనం ఉపయోగిస్తున్నాం కనుక మన అధీనంలో ఉన్నాయని అహంకరించరాదనీ, స్వార్థానికి వినియోగించరాదనీ, వాటిలో దివ్య చైతన్యం దాగి ఉన్నదనీ, వాటిని మనం బాధ్యతాయుతంగా ఆరాధనాభావంతో మాత్రమే వినియోగించాలని గుర్తించటానికీ ఈ సంప్రదాయం దోహదం చేస్తుంది.
అన్ని కర్మాగారాలలోనూ ఈ ఆయుధపూజ చేసే సంప్రదాయం ఉన్నది. ఆయుధాలూ, పరికరాలూ మాత్రమే కాదు, పరమాత్మ అనుగ్రహంతో తమకు లభించిన విద్యా శాస్త్ర కళా సంబంధమైన నైపుణ్యం కూడా తమది కాదని, తమకు అందిన ఉపకరణమనీ మనం గుర్తించడమే ఈ ఆయుధపూజలోని ఆంతర్యంగా చెప్పవచ్చు. ఏ కళాకౌశలాలైనా, ప్రతిభాపాటవాలైనా, శక్తి సామర్థ్యాలైనా తన ‘ద్వారా’ వ్యక్తమయ్యేవే కాని, తన ‘నుంచి’ వ్యక్త మయ్యేవి కాదని మనం గుర్తించాలి. ఆ విద్యలన్నీ పరమాత్ముని చేతి ఉపకరణాలు. ఆయుధాలు, తానూ ఒక ఉపకరణమే. వాటికి యజమాని పరమాత్మే. కనుక ఆ ఆయుధాలను పూజించాలని ఆంతర్యం. పరమాత్ముని అభీష్టం మేరకు పవిత్రభావనతో ఆ ఉపకరణాలను వినియోగించాలని తెలుసుకోవడానికి ఆయుధపూజ తోడ్పడుతుంది.
– శ్రీ
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

