ఇవాళ్టి బతుకమ్మ.. వేపకాయల బతుకమ్మ
తెలంగాణ పిండివంటల్లో సకినాలు ప్రత్యేకమైనవి. వేర్వేరు ప్రాంతాల్లో వీటిని చేసుకున్నా.. ఇక్కడ వచ్చినంత రుచిగా మరెక్కడా కుదరవు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ పిండి వంటకం గురించి తెలియదన్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
తెలంగాణ పిండివంటల్లో సకినాలు ప్రత్యేకమైనవి. వేర్వేరు ప్రాంతాల్లో వీటిని చేసుకున్నా.. ఇక్కడ వచ్చినంత రుచిగా మరెక్కడా కుదరవు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ పిండి వంటకం గురించి తెలియదన్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. బియ్యంపిండి, నువ్వులు, ఓమా, ఉప్పు వేసి తగిన మోతాదులో నీళ్లు కలిపి పిండిని తయారు చేస్తారు. పిండిని చేతుల్లోకి తీసుకొని అందంగా చుడతారు. సకినాలు చుట్టడం ఒక కళ. అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. సకినాలు చుట్టడం వచ్చిన వారికి చుట్టాలు, పక్కాలు తెగ మర్యాదలు చేస్తుంటారు.
‘సకినాలు చేస్తున్నాం వదినా! మీరు వస్తేనే అవుతుంది’ అంటూ సగౌరవంగా ఆహ్వానిస్తారు. సకినాల మూకుడు రోజు పిల్లల సంబురం అంతా ఇంతా కాదు. పిల్లలంతా గుమిగూడి పిండిముద్ద తీసుకొని, చిట్టి చేతులతో పాలకాయలు లేదా వేపకాయలుగా చేస్తారు. అందుకే ఇవాళ్టి బతుకమ్మను వేప (పాల)కాయల బతుకమ్మగా పిలుస్తారు. సకినాల బతుకమ్మగానూ ఆరాధిస్తారు. నూనెలో గోలించినా సకినాలకు చమరు ఎక్కువగా ఉండదు. బురబురలాడే ఈ పిండివంటకాన్ని కరకర నములుతూ ఆరగిస్తారు. ఇందులో వాడే నువ్వులు, ఓమా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సాయంత్రం బతుకమ్మ ఆడిన తర్వాత సకినాలను అందరూ పంచుకొని ఆ రోజుకు కమ్మని ముగింపునిస్తారు.
– డా॥ ఆర్.కమల
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

