Sri Rama Navami 2026 | సీతారాముల కల్యాణం నేడే ఎందుకు?
Sri Rama Navami 2026 | చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు జన్మించాడు. ఆ పర్వదినాన్ని శ్రీరామనవమిగా చేసుకుంటారు. ఈ సందర్భంగా ఊరూవాడా సీతారాముల కల్యాణం జరుపుతారు.
Sri Rama Navami 2026 | నిజానికి సీతారామ కల్యాణం ఉత్తర ఫల్గుణి నక్షత్ర యుక్త వైశాఖ శుద్ధ దశమి నాడు జరిగింది. కానీ, ‘మహతాం జన్మనక్షత్రే వివాహం’ అంటుంది ఆగమశాస్త్రం.మహాత్ములు, అవతారమూర్తుల జన్మతిథి నాడు ఆ నక్షత్రంలో కల్యాణం చేయాలని శాస్త్ర వచనం. చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు జన్మించాడు. ఆ పర్వదినాన్ని శ్రీరామనవమిగా చేసుకుంటారు. ఈ సందర్భంగా ఊరూవాడా సీతారాముల కల్యాణం జరుపుతారు.
ఇలా పూజిద్దాం శ్రీరామచంద్రుణ్ని అనేక రకాలుగా పూజించవచ్చు
- శ్రీరామ అష్టోత్తర పారాయణం చేయవచ్చు. రామరక్షా స్తోత్రం, ఆపదుద్ధారక స్తోత్రం వంటి రామస్తోత్రాలు శ్రీరామనవమి సందర్భంగా పారాయణం చేయాలి.
- ‘శ్రీరామాయ నమః’ అనే మంత్రం జపం చేయవచ్చు. మంత్రోపదేశం ఉన్నవాళ్లు మాత్రమే, గురువు ఆదేశానుసారం దీనిని జపించాల్సి ఉంటుంది.
- ‘శ్రీరామ’ నామాన్ని సాధ్యమైనన్ని పర్యాయాలు జపించొచ్చు. ‘హరేరామ హరేరామ రామరామ హరేహరే, హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే’ మంత్రాన్ని యథాశక్తి చేసుకోవచ్చు.
- నిత్యదేవతార్చనలో భాగంగా షోడశ ఉపచార విధులతో స్వామివారి పూజ చేయవచ్చు.
- రామకోటి రాయడం, రామ భజన చేయడం కూడా అర్చనలో భాగమే!
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

