Port | కోటలో నుంచి ఎదురించు!

స్వామి వివేకానంద వంటి సర్వసంగ పరిత్యాగులకే కాదు రామకృష్ణులు సాంసారికులకు ఆధ్యాత్మిక మార్గం ఉపదేశించారు. కలకత్తా వైద్య కళాశాలకు చెందిన రసాయన శాస్త్ర బోధకుడు రామచంద్ర దత్త గృహస్థుడు. పరమహంసకు శిష్యుడు. ఆయన ఒకసారి రామకృష్ణులతో ‘నేను కుటంబాన్ని విడిచి సన్న్యాసం తీసుకోవాలని అనుకుంటున్నాన’ని అన్నారు. అప్పుడు పరమహంస ‘ఆలోచన రహితంగా ఏదీ చేయకూడదు. ఎవరి ద్వారా ఏం చేయించాలో భగవంతుడికి తెలుసు. సంసారాన్ని త్యజిస్తే నీ భార్యాబిడ్డల గతి ఏమవుతుంది? నీ కోసం భగవానుడు ఏర్పాటు చేసిన దానిని నువ్వు తారుమారు చేయడానికి ప్రయత్నించవద్దు. సంసారంలో ఉండటం ఒక కోటలో జీవించటం లాంటిది. శత్రువును కోట బయట నుంచి ఎదుర్కోవడం కన్నా, కోటలో ఉండి ఎదుర్కోవడమే సులభం. కామక్రోధలోభమోహాలే ఆ శత్రువులు. మూడింట నాలుగో వంతు మనస్సును భగవదాయత్తం చేసినప్పుడు మాత్రమే నువ్వు సంసారాన్ని పరిత్యజించే స్థితిలో ఉండగలవు. అయినా సంసారం కూపమనీ, అరణ్యమనీ ఎందుకంటావు? మొదట్లో అలాగే అనిపిస్తుంది. కానీ, భగవంతుణ్ని ఆశ్రయించాక సంసార భయం తొలగిపోతుంది. ఆ సంసారమే ఆనందధామంగా ఒప్పారుతుంది. ఓ చేత్తో సంసారాన్ని, మరోచేత్తో పరమాత్మను పట్టుకో’ అని అనునయించారు పరమహంస.
- మనోజ్ఞ
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

