ప్రధాన దైవం తర్వాతే.. నవగ్రహాలు!

నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసిన తర్వాత కాళ్లు తప్పనిసరిగా కడుక్కోవాలా? అలాగే దేవాలయంలో ప్రధాన దైవం, ఇతర ఉపాలయాలు దర్శించుకున్న తర్వాతే చివరగా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలని చెబుతారు ఎందుకు?
- ఆనంద్, వరంగల్
నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసిన తర్వాత కాళ్లు కడుక్కోవాలని ఏ ధర్మ శాస్త్రమూ చెప్పలేదు. అదొక మూఢ నమ్మకం మాత్రమే. మామూలుగా గ్రహ పీడా నివారణ కోసం చేసేదే నవగ్రహ ఆరాధన. పీడను వదిలించుకోవడానికే ప్రదక్షిణలు. విధి విధానంగా చేసే ఆ ఆరాధన వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయని నమ్మకం.
“ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః”
ఈ స్తోత్రాన్ని గానీ, నవగ్రహ స్తోత్రాలను గానీ పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి. దేవాలయానికి వెళ్లిరావడం వల్ల పొందే పవిత్రతను నిలుపుకొనే ప్రయత్నం చేయాలి. దైవ దర్శనం చేసుకొన్న తర్వాత కాళ్లు కడుక్కోకూడదు.
ఆలయానికి వెళ్లినప్పుడు ముందుగా అక్కడి ప్రధాన దైవాన్ని దర్శించుకోవాలి. ఆ తర్వాతే ఉపాలయాలలో ఉండే దేవతలనూ, అనంతరం నవగ్రహాలను దర్శించుకోవాలి. ఆలయంలో సుప్రతిష్ఠితమైన ప్రధాన దైవాన్నీ, ఉపాలయాలలో ఉండే దేవతలనూ అనుగ్రహం కోసం వేడుకోవాలి. తర్వాత దోష పరిహారం కోసం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. అయితే, గ్రహపీడా శాంతి కోసం మాత్రమే గుడికి వెళ్తున్నట్లయితే ముందుగా నవగ్రహాలను దర్శించుకోవచ్చు. లేని పక్షంలో ఆలయ ప్రధాన దైవాన్ని దర్శించుకున్న తర్వాతే మిగతావి.
డా॥ శాస్ర్తుల రఘుపతి
73867 58370
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
- Tags
- navagraha pooja
- Temple
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

