Ugadhi | ఉగాది పచ్చడిలో 6 రుచులను ఎందుకు కలుపుతారు ?
ఉగాది కాలానికి సంకేతం. మానవ జీవనానికి, కాలానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకునే ఆనందవేళ ఉగాది. కాలాన్ని గుణిస్తూ, మారుతున్న కాలానికి (రుతువులకు) అనుగుణంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలనే సందేశాన్నిస్తుందీ పండుగ.
Ugadhi | ఉగాది కాలానికి సంకేతం. మానవ జీవనానికి, కాలానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకునే ఆనందవేళ ఉగాది. కాలాన్ని గుణిస్తూ, మారుతున్న కాలానికి (రుతువులకు) అనుగుణంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలనే సందేశాన్నిస్తుందీ పండుగ. సహనానికి, వ్యక్తిత్వ నిర్మాణానికి, మనోవికాసానికి ఆలవాలంగా నిలుస్తుంది. ఉగాది పండుగలో అన్నిటికన్నా విశేషమైంది ఉగాది పచ్చడి. మిగిలిన పండుగల్లో పిండివంటలు చేసుకుంటే ఉగాది రోజున పచ్చడి చేసుకుంటాం. అది కూడా పూర్తిగా స్వాభావికంగా. ఏవిధంగానూ పచనం (వండటం) చెయ్యకుండా తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం.. ఈ ఆరు రకాల రుచులు అందించే పదార్థాలు కలిపి తయారుచేసే పచ్చడి ఇది.

ఈ రుచుల్ని కలపడానికీ ఓ లెక్క ఉంది. తీపి, కారం సమానంగా కలపాలి. వీటి మోతాదుకు సగభాగం పులుపు, వగరు, వీటికి సగభాగం ఉప్పు, చేదు కలపాలి. మానవజీవితం అన్ని రుచుల కలయిక. అన్ని రుచులూ కలిస్తేనే మనిషి శరీరం సమగ్రవికాసాన్ని అందుకుంటుంది. మనస్సు విశ్వతోముఖంగా ప్రసరిస్తుంది. అందుకే ఉగాది నాడు ఆరు రుచుల పచ్చడిని ప్రసాదంగా అందజేస్తారు. మధురానుభూతుల తీపి, కష్టాల చేదు, సమస్యలతో మింగుడుపడని కారం, బాధల ఉప్పు, కడగండ్ల పులుపు, అపజయాల వగరు జీవితంలో సహజ రుచులు. వీటిని సమన్వయం చేసుకుని, అనుకూలంగా రంగరించుకుని ప్రయాణించడమే జీవనం.
ఉగాది పచ్చడిలో ఉపయోగించే పదార్థాలన్నీ శరీరంలో సమతూకాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందింపజేస్తాయి. సంవత్సరం పొడవునా జీవితంలో ఏర్పడే కష్టనష్టాలు, సుఖసంతోషాలను సమానంగా స్వీకరించి ముందుకుసాగాలనే తాత్త్విక సందేశం ఉగాది పచ్చడిలో ఉంది.
తీపి కామానికి, కారం క్రోధానికి, ఉప్పు మోహానికి, పులుపు లోభానికి, చేదు మదానికి, వగరు మాత్సర్యానికి సంకేతాలు. మనం తినే పదార్థాలు ఏవైనప్పటికీ ఈ ఆరు రుచుల్లోకే వస్తాయి. ఏదో ఒక రుచి లేకుండా మనం ఏ పదార్థాన్ని తినలేం. కాబట్టి, అన్ని రుచులను సమీకరించుకుని తింటే మనం గెలిచినట్లు. ఏదో ఒక రుచిని మాత్రమే మెచ్చుకుని, దాన్నే తీసుకుంటే ఓడినట్లు.
– శ్రీ భారతి
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

