Govindaraja Swamy Brahmotsavam | 26 నుంచి గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు..
Govindaraja Swamy Brahmotsavam | ఈ నెల 26 నుంచి జూన్ 3 వరకు తిరుపతిలోని గోవిందరాజ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉత్సవాలు 25న అంకురార్పణతో ప్రారంభంకానున్నాయి.
Govindaraja Swamy Brahmotsavam | ఈ నెల 26 నుంచి జూన్ 3 వరకు తిరుపతిలోని గోవిందరాజ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉత్సవాలు 25న అంకురార్పణతో ప్రారంభంకానున్నాయి. వార్షిక వేడుకల్లో ప్రతి రోజు ఉదయం, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. 26న ధ్వజారోహణం, పెద్దశేష వాహన సేవ జరుగనున్నది. 27న చిన్న శేషవాహన సేవ.. హంసవాహనం, 28 సింహ వాహనం, ముత్యపుపందిరి వాహనసేవపై గోవిందరాజస్వామి విహరించనున్నారు.
29న కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనసేవలు జరుగుతాయి. 30న ఉదయం మోహినీ అవతారం స్వామివారు కటాక్షించనున్నారు. అదే రోజు రాత్రి గరుడ వాహనం భక్తులను అనుగ్రహిస్తారు. 31న హనుమంత, గజవాహనసేవలపై విహరిస్తారు. జూన్ 1న సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలపై విహరిస్తారు. 2న రథోత్సవం, అశ్వవాహన సేవలు జరుగనున్నాయి. 3న చక్రస్నానం, ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగుస్తాయి. వేడుకల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిత్యం ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వివరించింది.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

