కొత్త ఏడాదికి గీతా కవచం
కొత్త ఆశలతో, సరికొత్త ఆశయాలు నెరవేర్చుకునే దిశగా నూతన సంవత్సరం వచ్చేసింది. గోడ మీద మారే క్యాలెండర్ తమజీవితాల్లోనూ ఏదైనా మార్పు తీసుకొస్తుందనిచాలామంది ఆశిస్తారు. కొత్త ఏడాదిలో ఉన్నతమైన మార్పును పొందాలనే లక్ష్యంతో స్వీయ లోపాలను అధిగమించడానికి కంకణబద్ధులు అవుతారు మరికొందరు. మొత్తంగా ప్రపంచమంతా ఏదో ఒక గొప్ప ఆశతో నిరీక్షిస్తుంది.
కొత్త ఆశలతో, సరికొత్త ఆశయాలు నెరవేర్చుకునే దిశగా నూతన సంవత్సరం వచ్చేసింది. గోడ మీద మారే క్యాలెండర్ తమజీవితాల్లోనూ ఏదైనా మార్పు తీసుకొస్తుందనిచాలామంది ఆశిస్తారు. కొత్త ఏడాదిలో ఉన్నతమైన మార్పును పొందాలనే లక్ష్యంతో స్వీయ లోపాలను అధిగమించడానికి కంకణబద్ధులు అవుతారు మరికొందరు. మొత్తంగా ప్రపంచమంతా ఏదో ఒక గొప్ప ఆశతో నిరీక్షిస్తుంది. ప్రతి ఒక్కరూ ఇంకాస్త మెరుగైన జీవితాన్ని ఆశించడం సహజమే కదా! భగవంతుడి ఆశీస్సుల కోసం మన జీవితాల్లో అంతులేని ఆనందం పొందగలమనే నమ్మకం అందరిలోనూ ఉంటుంది.

మానవులే కాదు.. సమస్త జీవజాలం ఆనందాన్ని ఆశించడంలో ఆశ్చర్యమేమీ లేదు. ప్రతిజీవి ఆనందంగా జీవించాలనే కోరుకుంటుంది. తమ ఆనందాన్ని మెరుగుపరుచుకునేందుకు తమకు లభించిన ఏ అవకాశాన్నీ వదులుకోవాలని భావించదు. ఈ నూతన సంవత్సరం కూడా అలాంటి అవకాశమే! తమను తాము ఉన్నతంగా మలుచుకోవడానికి నూతన సంవత్సరం ఆగమించిన ఈ రోజును కీలకంగా పరిగణిస్తారు. ఈ కొత్త సంవత్సరాన్ని వివిధ దేశాలు వివిధ సమయాల్లో జరుపుకొన్నప్పటికీ.. అందరూ ఆశించేది మాత్రం మంచి మార్పే! తమకు, తమ పిల్లలకు, తమ కుటుంబాలకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాలకు వెళ్లి తమకు మంచి జరగాలని భగవంతుణ్ని వేడుకుంటారు. పరస్పరం అభినందనలు తెలుపుకొంటూ మంచిని పంచుకుంటారు. అయితే, ఇలా అభినందనలు ఇచ్చిపుచ్చుకొన్నంత మాత్రాన కాలం నూతన శోభను సంతరించుకోదు! సానుకూలంగా ఆశించినంత మాత్రాన.. నూతన సంకల్పాలు నెరవేరవు. కేవలం ఆలోచనలు మారినంత మాత్రాన కాలం సానుకూలం అవ్వదు.
నూతన సంవత్సరమని మనం అనుకుంటున్నదంతా మనలో దాగి ఉన్న ఒక చేతనావస్థ. కేవలం ఒక ఆలోచనతోనో లేదా కోరుకున్నంత మాత్రంచేతనో ఆ చైతన్యం జాగృతమవదు. కాకపోతే, ఇది ఒక గొప్ప ఆరంభమని మాత్రం చెప్పుకోవచ్చు. మన జీవితం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉంటే రోజులే కాదు సంవత్సరాలు కూడా అలా గడుస్తూనే వెళ్లిపోతాయి! ఏదైనా నూతన విశేషంపై నీ ఆలోచనను మరల్చలేకుంటే ఇక నూతన అనుభూతిని మాత్రం ఎలా పొందగలవు? మన చైతన్యంలో మార్పురానిదే నూతన అనుభూతులు ఏనాటికైనా అసాధ్యమే!
మనం దైనందిన జీవితంలో పొందే పలు అనుభూతులు, ఆలోచనలను విశ్లేషించి ఎటువంటి దాపరికాలు లేకుండా వాటిని నాలుగు విభాగాలుగా వర్ణించింది భగవద్గీత. అంటే మన ఆలోచనలన్నీ ఈ నాలుగింటి పైనే!
1. ఆహారం
2. నిద్ర
3. భయం
4. మైథునం
మన మనస్సు, వాక్కు కర్మలన్నీ ఎంతసేపు పై నాలుగింటి పైనే కేంద్రీకృతమైతే ఇక ‘నూతన’ సంవత్సరమేది? అందుకే కొన్ని రోజులు గడవగానే ఈ కొత్త ఏడాది కూడా పాతదైపోయి మళ్లీ విసుగు పుట్టిస్తుంది. ఒకవేళ నూతన ఒరవడులు సృష్టించడంలో మీరు నిష్ణాతులైనప్పటికీ, అవి కూడా కేవలం పైన పేర్కొన్న నాలుగు అంశాలకే చెందినవైతే నూతన సంవత్సరానికి ఇక అర్థమేముంది? కొత్త అనే పేరుతో అంతా పాత ఒరవడే! జంతువుల జీవితాలు ఈ నాలుగు అంశాల చుట్టే తిరుగుతుంటాయి. మనమూ వాటి చుట్టూనే తిరుగుతుంటే వాటికీ, మనకూ తేడా ఏముంటుంది?
ఈ తాత్కాలికమైన ఆనందానుభూతులకు అతీతమైన శాశ్వత ఆనందం కోసం మానవుడు సంకల్పించాలని భగవద్గీత బోధిస్తుంది. దైనందిన జీవితంలో పైన పేర్కొన్న నాలుగు కీలకమే కావొచ్చు, కానీ, ఇంకా ఏదో ఉన్నతమైన, శాశ్వతమైన దానికోసం చాలామంది పరితపిస్తుంటారు. కానీ, మనలో అంతర్లీనమైన ఆ తపనను ఈ భౌతిక శరీరం సంతృప్తిపర్చలేదు. సాధారణ ప్రయత్నాలతో పరిపూర్ణమైన ఆనందం పొందజాలం.
కురుక్షేత్ర సంగ్రామ సమయంలో మానసిక ఉద్విగ్న పరిస్థితుల నడుమ కుంగిపోతున్న అర్జునుడికి గీతోపదేశం చేసి స్ఫూర్తిని కలిగించాడు శ్రీకృష్ణ పరమాత్మ. భగవద్గీతను విన్న అర్జునుడు తన కర్తవ్యాన్ని గుర్తించాడు. లోకహితం కోరి యుద్ధంలో పోరాడాడు. కృష్ణుడి బోధ తర్వాత అర్జునుడికి కొత్తగా రెండు చేతులు పుట్టుకురాలేదు. తన కుటుంబాన్ని వదిలి సన్యాసం తీసుకోలేదు. క్షత్రియుడిగా తన ధర్మాన్ని తెలుసుకున్నాడు. మార్పు సంభవించింది అర్జునుడి చైతన్యంలోనే! జీవితంపై, భగవంతుడిపై తన అవగాహనలో మార్పు వచ్చింది. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడి స్థానాన్ని గుర్తించి ఆయన సూచనలను పాటించాలని నిర్ణయించుకున్నాడు. భగవదాజ్ఞలను శిరసావహించి అమృతత్వాన్ని పొందగలిగాడు.
ఇదే అసలైన మర్మం. మీ ఆలోచనలను శ్రీకృష్ణుడిపైకి మరల్చండి. భగవద్గీత బోధనలను ఆచరించండి. మీ అంతర్గత ప్రపంచంలో ఇవి పెనుమార్పును తీసుకురాగలవు. అప్పుడు బాహ్య ప్రపంచంలో సైతం నూతన అనుభూతులను పొందగలం. అర్జునుడు పొందిన విజయం, సంపద, నీతి, శక్తియుక్తులను భగవత్ అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ అనుభూతి చెందగలరు.
ప్రపంచవ్యాప్తమైన హరేకృష్ణ ఉద్యమ ఆచార్యులైన శ్రీల ప్రభుపాదుల వారు మనందరమూ భగవద్గీతను యథాతథంగా చదివే వెసులుబాటు కల్పించారు. వారు చూపిన మార్గాన్ని అనుసరిస్తే ప్రతిరోజూ కొత్త ఏడాదే! మన చైతన్యాన్ని సచ్చిదానంద స్వరూపుడైన శ్రీకృష్ణుడిపైకి మరల్చేందుకు శ్రీల ప్రభుపాదుల వారు అందించిన మహత్తర మత్రం ‘హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే’. ఈ పవిత్రమైన మహామంత్రాన్ని ప్రతిరోజూ కనీసం ఒక్క మాల (108 సార్లు) జపంతోపాటు ప్రతిరోజూ భగవద్గీత నుంచి ఒక్క శ్లోకాన్ని పఠించాలనే సంకల్పంతో ఈ నూతన సంవత్సరంలో మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించండి.
– శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజి 93969 56984
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

