Guru purnima | గురు పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారు.. ఈ పర్వదినం విశిష్ఠత ఏమిటి..?
Guru purnima | మన దేశంలో హిందువులకు ఎన్నో పండుగలు ఉన్నాయి. అలాంటి పండుగల్లో గురు పౌర్ణమి పండుగ ఒకటి. ఈ పర్వదినాన్ని ఎంతో ప్రత్యేకమైన, పవిత్రమైన పండుగగా జరుపుకుంటారు. ఏటా హిందూ సంప్రదాయం ప్రకారం.. ఈ పండుగ ఆషాఢ పౌర్ణమి తిథి రోజున వస్తుంది.
Guru purnima : మన దేశంలో హిందువులకు ఎన్నో పండుగలు ఉన్నాయి. అలాంటి పండుగల్లో గురు పౌర్ణమి పండుగ ఒకటి. ఈ పర్వదినాన్ని ఎంతో ప్రత్యేకమైన, పవిత్రమైన పండుగగా జరుపుకుంటారు. ఏటా హిందూ సంప్రదాయం ప్రకారం.. ఈ పండుగ ఆషాఢ పౌర్ణమి తిథి రోజున వస్తుంది. కానీ ఈ సంవత్సరం ఆషాఢ పౌర్ణమి తిధి రెండు రోజులు.. అంటే మిగులు తగులుగా వచ్చింది. అంటే పౌర్ణమి తిథి జూలై 20న సాయంత్రం 5:59 గంటలకు ప్రారంభమై జూలై 21న మధ్యాహ్నం 03:46 గంటలకు ముగుస్తుంది.
హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యోదయం సముయంలో ఉన్న తిథిని పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి ఆషాఢ పౌర్ణమి తిథి సూర్యోదయం జూలై 21న ఉదయం 05:37 గంటలకు జరుగుతుంది. కాబట్టి జూలై 21న గురు పౌర్ణమి వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ గురు పౌర్ణమి ప్రత్యేకత ఏమిటి..? ఈ పర్వదినాన్ని ఎందుకు జరుపుకుంటారు..? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
గురు పౌర్ణమి ప్రత్యేకత ఏమిటి..?
ఈ గురు పౌర్ణమి పండుగకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది గురువులకు కృతజ్ఞత చెప్పుకునేందుకు జరుపుకునే పండుగ. ఎందుకంటే సనాతన హైందవ ధర్మంలో తల్లి, తండ్రి తర్వాత స్థానం గురువుకే దక్కింది. పైగా ఈ సృష్టిలో మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతిక్షణం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అందులో కొంత తల్లిదండ్రుల వద్ద నేర్చుకుంటే మిగిలినదంత గురువు దగ్గరే నేర్చుకుంటాడు. అందుకే గురువును.. ‘గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః’ అని కీర్తిస్తారు.
సంస్కృతంలో ‘గు’ అనే శబ్దానికి చీకటి అని అర్థం. ‘రు’ అంటే తేజస్సు అని అర్థం. అంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగుని ప్రసాదించేవాడే గురువు అని అర్థం. మన గమ్యానికి దారి చూపించేవాడే గురువు. మనకు తెలియని విషయాలను చెప్తూ.. అజ్ఞానాన్ని తొలగించే జ్ఞాన సంపన్నుడు, గుణసంపన్నుడుగా గురువు ఉంటాడు. పురణాల ప్రకారం గురు పూర్ణిమ రోజునే వ్యాస మహర్షి జన్మించాడట. అందుకే ఈ గురు పౌర్ణమిని వ్యాస పూర్ణిమి అని కూడా అంటారు. ఆయన జన్మదినాన్ని ఒక మహా పర్వదినంగా జరుపుకోవడం తరతరాలుగా కొనసాగుతోంది. ఈ రోజున గురు భగవానుడిని, వ్యాస మహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అందుకే ఈ రోజున గురువులను నమస్కరించి పూజించుకోవాలి.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

