నేడు శ్రీశైలంలో భ్రమరాంబ కుంభోత్సవం
శ్రీశైలం : ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకైన శ్రీశైల క్షేత్రంలో కొలువుదీరిన భ్రమరాంబ అమ్మవారికి కుంభోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏటా చైత్ర మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళ, శుక్రవారాల్లో అమ్మవారికి కుంభోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఉత్సవంలో భాగంగా అమ్మవారికి గుమ్మడి కాయలు, నిమ్మకాయలు సాత్విక బలిగా సమర్పిస్తారు. కార్యక్రమం సందర్భంగా ఆలయానికి నిమ్మకాయలతో అలంకరణ చేశారు. తెల్లవారు జాము నుంచే అమ్మవారికి విశేష పూజలు జరుగనున్నాయి.
ఉదయం 7.30 గంటలకు మొదటి విడుత సాత్విక బలులు సమర్పించనున్నారు. సాయంత్రం స్త్రీ వేషధారణలో అమ్మవారికి కుంభహారతి సమర్పించనున్నారు. ఆ తర్వాత పలు రకాల వంటలతో మహా నివేదన చేయనున్నారు. మరో వైపు దేవాదాయ చట్టం ప్రకారం క్షేత్ర పరిధిలో జంతువులు పక్షులు బలులను నిషేధించారు. కుంభోత్సవం నేపథ్యంలో అమ్మవారి ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను, స్వామివారి కల్యాణోత్సవం, ఏకాంత సేవ మంగళవారం నిలిపివేసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

