Vinayaka Chavithi | అష్టరూపాల్లో.. ఇష్టదైవం
మహారాష్ట్రలో పుణె, అహ్మద్‌నగర్, రాయ్‌గఢ్ జిల్లాల్లో స్వయంభువులుగా పేర్కొనే ఎనిమిది వినాయక మందిరాలు ఉన్నాయి. మయూరేశ్వర్ మొదలుకొని మహాగణపతి వరకు వరుసగా ఈ ఎనిమిది మందిరాలను దర్శించుకోవడం ఆనవాయితీ. మహాగణపతి ఆలయం తర్వాత మళ్లీ మోరేశ్వర్ను దర్శించుకోవడంతో అష్ట వినాయక పరిక్రమ పూర్తవుతుంది.
Vinayaka Chavithi | మహారాష్ట్రలో పుణె, అహ్మద్‌నగర్, రాయ్‌గఢ్ జిల్లాల్లో స్వయంభువులుగా పేర్కొనే ఎనిమిది వినాయక మందిరాలు ఉన్నాయి. మయూరేశ్వర్ మొదలుకొని మహాగణపతి వరకు వరుసగా ఈ ఎనిమిది మందిరాలను దర్శించుకోవడం ఆనవాయితీ. మహాగణపతి ఆలయం తర్వాత మళ్లీ మోరేశ్వర్ను దర్శించుకోవడంతో అష్ట వినాయక పరిక్రమ పూర్తవుతుంది. ఇలా చేస్తే అష్ట వినాయకుల అనుగ్రహంతో అష్టకష్టాలూ తొలగిపోయి, సకల శుభాలనూ పొందుతారనేది భక్తుల విశ్వాసం.
1. మోరేశ్వరుడు

పుణె నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోర్గావ్లో కొలువుదీరిన గణపతి మోరేశ్వర్ లేదా మయూరేశ్వర్. ఈ పట్టణం ఒకప్పుడు నెమళ్ల (మయూరాలు)కు ప్రసిద్ధిచెందిందని, అందుకే మోర్గావ్ అనే పేరు వచ్చిందని అంటారు. అంతేకాకుండా, సాధారణంగా నెమలి కుమారస్వామి వాహనం. ఇక్కడ మాత్రం ఆయన అన్న గణపతి నెమలి వాహనుడై కొలువుదీరడం విశేషం. సింధువు అనే రాక్షసుణ్ని సంహరించడానికి గణపతి మయూరేశ్వరుడిగా అవతరించాడని కథ ప్రచారంలో ఉంది.
2. సిద్ధివినాయకుడు

ఈ ఆలయం అహ్మద్‌నగర్ జిల్లాలోని సిద్ధటేక్‌లో ఉంది. ఎనిమిది వినాయక మందిరాల్లో ఏడింటిలో వినాయకుడి తొండం ఎడమ వైపు తిరిగి ఉండగా, ఒక్క సిద్ధటేక్‌లో మాత్రం కుడివైపు తిరిగి ఉంటుంది. పేరులో ఉన్నట్లుగానే ఇక్కడి వినాయకుడు భక్తుల కోరికలను తీర్చే కామధేనువు.
3. బళ్లాలేశ్వరుడు

ఈ మందిరం రాయ్‌గఢ్ జిల్లా పాలి గ్రామంలో ఉంది. తన భక్తితో వినాయకుడిని మెప్పించిన బళ్లాలుడు అనే యువకుడి పేరుమీద ఇక్కడి స్వామికి, ‘బళ్లాలేశ్వర్’ అనే పేరు నిలిచిపోయింది. తమ కోరికలు నెరవేరడానికి అకుంఠిత దీక్షతో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.
4. వరద వినాయకుడు

పుణెకు దగ్గర్లో ఉన్న మహద్ గ్రామంలో కొలువుదీరిన మూర్తి వరద వినాయకుడు. పేరులో ఉన్నట్లుగానే ఇక్కడి స్వామి తన దగ్గరికి వచ్చే భక్తులకు విజయాలను ప్రసాదిస్తాడు. ఇక్కడ ఆలయంలో నందాదీపంగా పిలిచే ఒక నూనె దీపం 1892 నుంచి అఖండంగా వెలుగుతూ ఉందని విశ్వసిస్తారు.
5. చింతామణి గణపతి

ఈ ఆలయం పుణె నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఓసారి కపిల మహర్షి కోసం గణపతి గుణాసురుడితో పోరాడాల్సి వస్తుంది. భీకరమైన యుద్ధం తర్వాత చింతామణి సాయంతో అందులో వినాయకుడు గెలుస్తాడు. అందుకే చింతామణి గణపతి అనే పేరు స్థిరపడిపోయింది. ఇక్కడి స్వామిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తే కోరిన కోరికలు తీరుతాయని నమ్ముతారు.
6. గిరిజాత్మజుడు

పుణె సమీపంలోని లేన్యాద్రి గుహల్లో కొలువుదీరిన గణపతే గిరిజాత్మజుడు. గిరిజాదేవి పార్వతి కొడుకు కోసం ఇక్కడ తపస్సు చేసిందని ఐతిహ్యం. అందుకే ఇక్కడి స్వామికి గిరిజాత్మజుడు అనే పేరు వచ్చింది. మిగిలిన మూర్తులకు భిన్నంగా, గుహ కుడ్యానికి మలచిన రూపాన్ని కలిగి ఉంటాడు ఇక్కడి స్వామి. 18 గుహల సముదాయంలో 7వ గుహలో గిరిజాత్మజుడు కొలువై ఉన్నాడు.
7. విఘ్నహరేశ్వరుడు

పుణె నాసిక్ మార్గంలో ఓజార్ పట్టణంలో వెలసిన దేవుడు విఘ్నహరుడు. విఘ్నాసురుడు అందరికీ విఘ్నాలు కలిగించేవాడు. అయితే గణపతి చేతిలో ఓడిపోవడంతో విఘ్నాసురుడు క్షమించమని స్వామి కాళ్లమీద పడతాడు. తన పేరు గణపతితో కలిసి ఉండాలని వరం కోరుకుంటాడు. అలా ఇక్కడి దేవుడికి విఘ్నహరేశ్వరుడు అనే పేరు నిలిచిపోయింది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోవాలనుకునే వాళ్లు విఘ్నహరుణ్ని పూజిస్తారు.
8. మహాగణపతి

పుణెకు 50 కిలోమీటర్ల దూరంలో రంజన్‌గావ్‌లో గజాననుడు కొలువుదీరాడు. ఇక్కడి దేవుడిని మహాగణపతి రూపంలో కొలుస్తారు. త్రిపురాసుర సంహారానికి ముందు పరమేశ్వరుడు తనకు విఘ్నాలు కలగకుండా ఉండటానికి ఇక్కడే తన కొడుకైన గణపతిని ప్రార్థించాడని స్థల పురాణం.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

