హైదరాబాద్ : నగరంలోని పోచారం ఐటీకారిడార్ ఓ ఉన్నాది ఎయిడ్స్ ఇంజక్షన్ (AIDS-Infected Injection ) తో దాడికి గురైన యువతి ఆత్మహత్య ( Suicide ) చేసుకుంది. రమణి అనే యువతి పెళ్లికి నిరాకరించిందన్న కసితో మనోహర్ అనే ఎయిడ్స్గ్రస్తుడు గత నెల 11న యువతిని బెదిరించి ఎయిడ్స్ ఉన్న రక్త ఇంజక్షన్ ఇచ్చాడు. అన్నోజిగూడ రాజీవ్ గృహ కల్పలో ఉంటున్న యువతి శుక్రవారం ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా ఈ ఘటనలో ఇప్పటికే నిందితుడు మనోహర్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు.