బ్లేడ్‌తో గర్భిణీకి సిజేరియన్ ఆపరేషన్.. తల్లి, బిడ్డ మృతి

లక్నో: చదువును మధ్యలో ఆపేసిన ఒక వ్యక్తి షేవింగ్ బ్లేడ్‌తో గర్భిణీకి సిజేరియన్ ఆపరేషన్ చేశాడు. దీంతో తల్లి, బిడ్డ మరణించారు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సైని గ్రామంలోని మా శారదా ఆసుపత్రి నిర్వాహకుడు రాజేష్ సాహ్ని అనర్హులతో శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నాడు. పూనం అనే నిండు గర్భిణీని డెలివరీ కోసం ఆమె కుటుంబ సభ్యులు ఆ క్లినిక్‌కు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో 8వ తరగతి చదువును మధ్యలో ఆపేసి స్కూల్ మానేసిన రాజేంధ్ర శుక్లా అనే వ్యక్తి గడ్డం గీసుకునే బ్లేడ్‌తో ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో ఆ మహిళ చనిపోయింది. కొంతసేపటి తర్వాత బిడ్డ కూడా మరణించింది.
మహిళ భర్త రాజారామ్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ క్లినిక్‌లో ఎలాంటి వైద్య సదుపాయాలు లేవని, అనర్హులతో శాస్త్రచికిత్సలు చేసి రోగుల ప్రాణాలు తీస్తున్నారని ఆరోపించారు. దర్యాప్తు చేసిన పోలీసులు దీనిని నిర్ధారించుకున్నారు. రాజేంద్ర శుక్లాతోపాటు రాజేష్ సాహ్నిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అక్రమ క్లినిక్‌లపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని చీఫ్ మెడికల్ అధికారికి పోలీసులు లేఖ రాశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

