గర్భం దాల్చినట్లుగా బ్లాక్మెయిల్… ప్రియుడి నుంచి రూ.67 లక్షలు దోచిన ప్రియురాలు
ముంబై: గర్భం దాల్చినట్లుగా ప్రియుడ్ని బ్లాక్మెయిల్ చేసిన ప్రియురాలు అతడి నుంచి పలు దఫాలుగా రూ.67 లక్షలు దోచుకుంది. తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఈ మేరకు అతడ్ని మోసగించి పారిపోయింది. దీంతో బాధిత వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. వ్యాపారి అయిన బంధువు వద్ద 26 ఏళ్ల వ్యక్తి పని చేస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో కోరెగావ్ భీమా ప్రాంతంలోని ఒక లాడ్జిలో బస చేసిన సందర్భంగా ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. అనంతరం ఆమెతో సంబంధానికి దారి తీసింది. దీంతో ఆ మహిళకు అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చేవాడు.
కాగా, ఆ మహిళ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆ వ్యక్తిని బ్లాక్మెయిల్ చేసింది. హడప్సర్లో నివాసం ఉండే 26 ఏళ్ల చేతన్ రవీంద్ర హింగ్‌మీర్‌ను భర్తగా, 27 ఏళ్ల నిఖిల్ అలియాస్ గౌరవ్ మ్హెత్రేని సామాజిక కార్యకర్తగా పరిచయం చేసింది. తాను ప్రెగ్నెంట్ అని, రేప్ కేసు పెడతానంటూ ఆ వ్యక్తిని బెదిరించింది. దీంతో ఆ ముగ్గురు కలిసి అతడి నుంచి పలు దఫాలుగా రూ.67.07 లక్షలు వసూలు చేశారు.
అయితే మరింతగా డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో ఆ వ్యక్తి కోంద్వా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఇన్స్పెక్టర్ హేమంత్ పాటిల్ నేతృత్వంలో క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన యాంటీ ఎక్స్టార్షన్ సెల్ బృందం రంగంలోకి దిగింది. ఈ కేసు దర్యాప్తును ప్రారంభించింది. మహిళ స్నేహితులైన రవీంద్ర, నిఖిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఆ మహిళ కోసం గాలిస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- extorting
- Lover
- Woman flees
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

