Burnt alive | ఆస్తికోసం మహిళ పైశాచికం.. తల్లీబిడ్డల సజీవ దహనం
Burnt alive | ఆస్తికోసం ఒక మహిళ మృగంగా మారింది. తన పిన్ని, తమ్ముడిని బ్రతికుండగానే నిప్పటించి హత్య చేసింది. చనిపోతున్న వారి కేకలు విని చుట్టుపక్కలవారు వచ్చిచూడగా.. ఆ మహిళ ఇంకా కిరోసిన్ పోస్తూనే ఉంది. ఆమెను జనం పట్టుకొని చితకబాది

ఆస్తికోసం ఒక మహిళ మృగంగా మారింది. తన పిన్ని, తమ్ముడిని బ్రతికుండగానే నిప్పటించి హత్య చేసింది. చనిపోతున్న వారి కేకలు విని చుట్టుపక్కలవారు వచ్చిచూడగా.. ఆ మహిళ ఇంకా కిరోసిన్ పోస్తూనే ఉంది. ఆమెను జనం పట్టుకొని చితకబాది.. పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన బీహార్‌లో జరిగింది.
బీహార్ రాజధాని పట్నాలో గురువారం మాధురి దేవి అనే మహిళ వృద్దురాలైన తన చిన్నమ్మ, ఆమె కొడుకుని ఆస్తి కోసం హత్య చేసింది. ఆమె హత్య చేస్తుండగా.. ఇరుగుపొరుగన వారు పట్టుకున్నారు. కానీ అప్పటికే తల్లీకొడుకులు చనిపోయారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మాధురీ దేవిని అరెస్టు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. పట్నాకు చెందిన శాంతి దేవి(70) అనే వృద్ధ మహిళ ఒక అనాధ. తన భర్త లాల్ దాస్ మరణించిన తరువాత సంతానం లేని ఆమె ఒక 11 ఏళ్ల బాలుడిని దత్తత తీసుకుంది. తాను మరణించిన తరువాత తన ఆస్తి మొత్తం ఆ బాలుడికే చెందాలని శాంతి దవి వీలునామా రాసింది. కానీ శాంతి దేవి ఇలా ఆస్తి ఒక దత్త పుత్రుడికి ఇచ్చేయడంతో ఆమె బంధువులు కోపడ్డారు. ముఖ్యంగా శాంతి దేవి భర్త సోదరుడి కూతురు మాధురీ దేవి ఈ విషయంలో ఇంటికొచ్చి గొడవ చేసింది.
దీంతో శాంతి దేవి తను నివాసముంటున్న ఇల్లు మినహా మిగతా ఆస్తి మొత్తం విక్రయించేసింది. ఇది తెలిసిన మాధురీ దేవి మళ్లీ శాంతి దేవి ఇంటికొచ్చి గొడవ చేసింది. తన చిన్నాన్న ఆస్తి మొత్తం తనకే చెందుతుందని.. అలా కాకుండా మరొకరికి కట్టపెడితే చంపేస్తానని బెదిరించింది. ఆ బెదిరింపులకు భయపడని శాంతి దేవి.. ఆమెతో గొడవ పడింది. గొడవ ముదిరి ఆవేశంలో మాధురీ దేవి.. శాంతి దేవి, ఆమె దత్త పుత్రుడైన 11 ఏళ్ల బాలుడిపై దాడి చేసింది. అనంతరం వారిద్దరిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది.
అలా ఇంట్లోనుంచి పొగ రావడంతో పొరుగింటి వారు హుటాహుటిన అక్కడికి వచ్చారు. అక్కడ శాంతిదేవి మంటల్లో కాలిపోతుండగా.. మాధురీ దేవి మరింత కిరోసిన పోస్తూ ఉంది. ఇది చూసిన చుట్టు పక్కల వారు ఆమెను పట్టుకొని చితకబాది ఒక స్తంభానికి కట్టేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మాధురీ దేవిని అరెస్టు చేసి ఆమెపై హత్య కేసు నమోదు చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Alias Rukmini Trailer | పగలు కోర్టులో స్టెనోగ్రాఫర్, రాత్రి రొమాంటిక్ రచయిత.. యూట్యూబ్‌లో దూసుకుపోతున్న నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ ట్రైలర్!
Bomb Cyclone effect | బాంబ్ సైక్లోన్‌తో అమెరికా ఉక్కిరిబిక్కిరి.. న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు..!
ఉద్యోగాలపై ప్రశ్నిస్తే దాడులా? కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ: నాగరాజు గుర్రాల
Jithu Madhavan | టాలీవుడ్లోకి ‘సీన్’ డైరెక్టర్ ఎంట్రీ.. మైత్రీ మూవీ మేకర్స్‌తో భారీ ప్రాజెక్ట్, హీరో ఎవరంటే?
Dads Little Friend | ‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ మూవీ రివ్యూ.. కంటతడి పెట్టించే ఫీల్‌గుడ్ ఫ్యామిలీ డ్రామా!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

