యూపీలో ఢిల్లీ తరహా ఘటన.. వివాహితను 6 ముక్కలుగా నరికేశాడు..
Uttar Pradesh | దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య ఘటన మరువక ముందే.. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఓ వివాహితను యువకుడు ఆరు ముక్కలుగా నరికేశాడు. అనంతరం
లక్నో : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య ఘటన మరువక ముందే.. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఓ వివాహితను యువకుడు ఆరు ముక్కలుగా నరికేశాడు. అనంతరం మృతదేహాన్ని ఓ బావిలో పడేశాడు. తలను పక్కనే చెరువులో పడేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
వివరాల్లోకి వెళ్తే.. అజంఘర్ జిల్లాలోని ఇషాక్‌పూర్ గ్రామానికి చెందిన ఆరాధనకు ప్రిన్స్ యాదవ్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కానీ ఆమె ఈ ఏడాది ప్రారంభంలో మరో యువకుడితో వివాహం చేసుకుంది. ఈ క్రమంలో ఆరాధనపై యాదవ్ కక్ష పెంచుకున్నాడు. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో యాదవ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.
ఈ క్రమంలో నవంబర్ 9వ తేదీన ఆరాధనను యాదవ్ గుడికి వెళ్తామని చెప్పి బయటకు తీసుకెళ్లాడు. కానీ ఆమెను చెరుకు తోటల్లోకి తీసుకెళ్లి పదునైన ఆయుధాలతో చంపేశాడు. ఫ్రెండ్ సహాయంతో ఆమెను 6 భాగాలుగా నరికేశాడు. తలను వేరు చేశాడు. అనంతరం ఆమె శరీర భాగాలను పశ్చిమి గ్రామ సమీపంలోని బావిలో పడేశాడు. నవంబర్ 15న బావిలో తేలియాడుతున్న శరీర భాగాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివాహిత శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే ఆరాధన తల కోసం పశ్చిమి గ్రామ సమీపంలోని చెరువు వద్దకు యాదవ్‌ను తీసుకెళ్లగా, అక్కడ దాచిన తుపాకీతో పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు కూడా అప్రమత్తమై ఎన్కౌంటర్ చేశారు. యాదవ్ గాయాల పాలయ్యాడు. ఈ కేసులో యాదవ్‌తో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

