లోన్‌కు డబ్బుల కోసం.. మాజీ ప్రియురాలిని బ్లాక్మెయిల్

న్యూఢిల్లీ: లోన్ చెల్లించేందుకు డబ్బుల కోసం ఒక వ్యక్తి తన మాజీ ప్రియురాలిని బ్లాక్మెయిల్ చేశాడు. ఆమె వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బెదిరించి రూ.15 వేలు తీసుకున్నాడు. మరోసారి డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యక్తి ఆమె మాజీ ప్రియుడని దర్యాప్తులో తేలింది. పాత ఢిల్లీలో నివాసం ఉండే శుభం శర్మ తీసుకున్న లోన్ చెల్లించలేకపోయాడు. దీంతో మాజీ ప్రియురాలిని బ్లాక్మెయిల్ చేయాలని నిర్ణయించాడు. ఆమె ఫేస్బుక్ ఖాతాను హ్యాక్ చేసి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సేకరించాడు. నకిలీ ఐడీ కార్డుతో మొబైల్ సిమ్ సమకూర్చుకున్నాడు. మాజీ ప్రియురాలికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు.
భయపడిన ఆమె తొలుత రూ.15,000 ఇచ్చింది. మరోసారి డబ్బుల కోసం అతడు బ్లాక్మెయిల్ చేయడంతో సీమాపురి పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఫేస్బుక్ నుంచి నిందితుడి ఐపీ అడ్రస్ వివరాలు సేకరించారు. నకిలీ ఐడీతో సిమ్ తీసుకున్న మొబైల్ నంబర్‌ను గుర్తించారు.
వర్చువల్ నంబర్ ద్వారా ఆ మహిళను మరోసారి రూ.15,000 వేలు డిమాండ్ చేస్తుండగా సైబర్ సెల్ పోలీసులు అతడి లొకేషన్‌ను ట్రేస్ చేశారు. అతడ్ని అరెస్ట్ చేయగా ఆ మహిళ మాజీ ప్రియుడు శుభం శర్మగా తేలింది. పోలీసులు ప్రశ్నించగా ఆమె ఫేస్బుక్ ఖాతాను హ్యాక్ చేసి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సేకరించి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసినట్లు అతడు ఒప్పుకున్నాడు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

