Two cars burned | అర్ధరాత్రి రెండు కార్లు దగ్ధం

కార్వాన్ : ఆలయం వెనుక వైపు నిలిపి ఉంచిన రెండు కార్లు దగ్ధమైన సంఘటన టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ జి. సంతోష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గుడిమల్కాపూర్ డివిజన్లోని జాఫర్గుడాలో అన్నపూర్ణ ఆలయం ఉంది.
ఈ ఆలయం చట్టు పక్కల ఖాళీ స్థలం ఉండడంతో ప్రతిరోజు స్థానికులు చాలామంది తమతమ కార్లు రాత్రి వేళలో ఇక్కడ నిలిపి ఉంచుతారు. అయితే ఎప్పటిలాగే మంగళవారం రాత్రి రెండు కార్లు ఎవరో నిలిపి వెళ్ళారు. కాగా బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అన్నపూర్ణ ఆలయం వెనుక వైపు నిలిపి ఉంచిన రెండు కార్లు దగ్ధమయ్యాయి.
ఇది గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
అయితే కార్లు అప్పటికే పూర్తిగా కాలిపోవడంతో వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోగా ఈ కార్లు తమవని ఎవరు కూడా పోలీసులకు సమాచారం గాని, ఫిర్యాదు గాని చేయలేదు. అయినప్పటికి కార్లు కాలిపోయిన విషయమై తాము దర్యాప్తు చేస్తున్నామని కార్ల యజమానులు వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

