మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని.. నానమ్మను హత్య చేసిన మనవడు

చెన్నై: మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో నానమ్మను మనవడు హత్య చేశాడు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. పసువనపాలెం గ్రామానికి చెందిన సుశీల అంగన్వాడీ కార్యకర్తగా పని చేసి రిటైర్ అయ్యింది. ఆమె కుమారుడు రంగనాథన్ చెన్నైలోని వనగ్రామ్‌లో నివసిస్తున్నాడు. రంగనాథన్ కుమారుడు 30 ఏండ్ల జగన్ అప్పుడప్పుడు నానమ్మ ఇంటికి వస్తుండేవాడు.
ఈ క్రమంలో ఇటీవల నానమ్మ సుశీల ఇంటికి వచ్చిన మనవడు జగన్ బుధవారం రాత్రి మద్యం కొని తాగేందుకు డబ్బులు అడిగాడు. దీనికి ఆమె నిరాకరించడంతో ఆగ్రహించిన జగన్ అట్ల పెన్నంతో నానమ్మ తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆ వృద్ధురాలు చనిపోయింది.
అనంతరం అక్కడి నుంచి పారిపోయిన జగన్ సమీప గ్రామంలోని తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి నిందితుడు జగన్‌ను అరెస్ట్ చేశారు. అతడ్ని ప్రశ్నించగా నానమ్మను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

