కాచిగూడ : ఇంట్లోంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసు కుంది. ఏఎస్సై సాయిరాం తెలిపిన వివరాల ప్రకారం చెప్పల్బజార్లోని హనుమాన్ టెంపుల్ ప్రాంతానికి చెందిన వెంకన్న కుమార్తె ఇంద్రకాంతి వనజ (21) ఈ నెల 10న బయటకు వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పివెళ్లింది.
అలా వెళ్లిన వనజ ఇప్పటికీ తిరిగి రాకపోవడంతో కలత చెందిన కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తండ్రి వెంకన్న శుక్రవారం కాచిగూడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇంట్లోంచి ఇంద్రకాంతి వనజ వెళ్లే సమయంలో గులాబీ రంగు టాప్, ఆరెంజ్ రంగు లెగ్గింగ్ ధరించి, ఎత్తు 4.5 ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.