Accident | లిఫ్ట్ నుంచి జారిపడి వ్యక్తి మృతి

వెంగళరావునగర్ : లిఫ్ట్ డోరు తెరుచుకుని మూడో అంతస్తు నుంచి పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం..ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ ఎదురుగా ఉండే అమ్మాన నిలయంలో నివసించే ఎం.సుబ్బారావు (39) ప్రైవేటు సంస్ధలో పనిచేస్తున్నాడు. ఈ నెల 15న తన మిత్రులైన సురేష్, నాగరాజులతో కలిసి ఎస్.ఆర్ నగర్ ఉమేశ్‌చంద్ర కూడలి సమీపంలో ఉన్న నందిని బార్‌కు వెళ్లాడు.
బార్ నుంచి బయటకు వచ్చి కిందకు రావడం కోసం మూడో అంతస్థులో ఉన్న లిఫ్ట్‌డోర్ తీశాడు. కాగా లిఫ్ట్ రాకున్న తలుపు తెరుచుకోవడంతో లోనికి కాలుపెట్టి లిఫ్ట్గుంతలో పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని 108 ఆంబులెన్స్ ద్వారా అమీర్‌పేటలోని ఆస్టర్ ప్రైం దవాఖానాకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి సోమాజిగూడలోని యశోద దవాఖానాకు మార్చారు.
ఈ నెల 25న సనత్ నగర్‌లోని ఈఎస్ఐ దవాఖానాలో చేర్పించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆదివారం సుబ్బారావు మృతి చెందారు. సుబ్బారావు మృతి పై అనుమానాలున్నాయని ఆయన సోదరి జ్యోతి శ్యామల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

