suiside | ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

అడ్డగుట్ట : ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్లప్ప, బాధితుల కథనం ప్రకారం… అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన వెంకటేష్ (41) వృత్తిరీత్యా కారుడైవర్. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య పిల్లలతో కలిసి వెంకటేష్ దోమలగూడలో ఉంటున్నాడు. వెంకటేష్ తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీలో చురుకైన పాత్ర పోషించాడు.
ఉద్యమంలో భాగంగా పలుమార్లు జైలుకు కూడా వెళ్లాడు. కరోనా సమయంలో ఉద్యోగం పోవడంతో ఆర్థికంగా చాలా బలహీనపడ్డాడు. అడ్డగుట్టలో ఉండే వెంకటేష్ తల్లి వద్దకు 21న సాయంత్రం వచ్చి భోజనం చేసి గదిలోకి వెళ్లి పడు కున్నాడు. ఉదయం 8 గంటల ప్రాంతంలో గదిలోకి వెళ్లిచూడగా ఫ్యాన్‌కు ఉరేసుకొని ఉన్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

