బడంగ్‌పేట : పోన్లో గేమ్ ఆడొద్దని తండ్రి మందలించినందుకు ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వోదయ కాలనీలో నివాసం ఉంటున్న మనోహర్ చారీ కూతురు కౌసికి (17) బెడ్ రూమ్‌లో చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సిఐ మహేందర్ రెడ్డి తెలిపారు.
కౌసికి ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోందన్నారు.పోన్లు ఎక్కువ చూడ కూడదని, ఫోన్లో గేమ్ ఆడకూడదని తండ్రి మందలించడంతో మనస్తాం చెందిన బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.