దారుణం : తండ్రిని రోకలిబండతో కొట్టి హతమార్చిన కుమారుడు
తండ్రిని హతమార్చిన కుమారుడు | ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా దర్శి మండలం మోటుపల్లిలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా పెంచిన మమకారాన్ని మరిచి కుమారుడు అతిదారుణంగా కొట్టి తండ్రిని హతమార్చాడు.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా దర్శి మండలం మోటుపల్లిలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా పెంచిన మమకారాన్ని మరిచి కుమారుడు అతిదారుణంగా కొట్టి తండ్రిని హతమార్చాడు. మోటుపల్లికి చెందిన అమృతరావు (75) కుమారుడు సురేష్ (30) మధ్య మధ్యాహ్నం మాటామాటా పెరిగి ఘర్షణ జరిగింది. తీవ్ర ఆగ్రహావేశానికి లోనైన సురేష్ రోకలి బండతో తండ్రి తలపై కొట్టాడు. దీంతో తల పగిలి తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మూడేళ్ల క్రితం సురేష్ భార్యను సైతం ఇదే తరహాలో హతమార్చిన గ్రామస్తులు తెలిపారు. ఘటనాస్థలంలో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ బుకింగ్స్ ప్రారంభం.. ఈ శుక్రవారం నుంచే థియేటర్లలో సందడి!
World Telugu Sahithi Conference | చైనాలో ఘనంగా 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి : ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
Back Pain Problem | యువతను అధికంగా వేధిస్తున్న నడుము నొప్పి సమస్య.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ఇరువురి మధ్య గొడవను అడ్డుకునేందుకు వెళ్లిన మహిళ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

