Sexual assault | పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై లైంగికదాడి

బంజారాహిల్స్ : పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడడంతో పాటు మోసానికి పాల్పడ్డ వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 1లోని కమలాపురి కాలనీలో నివాసం ఉంటున్న యువతి (38) బ్యూటీ ప్రొడక్ట్స్ విక్రయించడంతో పాటు మహిళలకు మసాజ్ చేస్తుంటుంది.
ఈ క్రమంలో తన భార్య, తల్లికి కావాల్సిన మెహందీ పౌడర్ తదితర వస్తువులను తీసుకునేందుకు వచ్చే క్రమంలో ఆమెకు తమీమ్ జలాల్ అలియాస్ అఖీల్ (28) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇదే క్రమంలో ఎవరూ లేని సమయంలో యువతిని బలవంతంగా లోబర్చుకున్న తమీమ్ జలాల్ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు.
ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అలా పలుమార్లు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అయితే సంవత్సరాలు గడిచినా పెళ్లి మాట ఎత్తకపోగా ఇటీవల ముఖం చాటేస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

