మెహిదీపట్నం : ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడాదిన్నర చిన్నారిపై లైంగిక దాడి జరిగిన సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున వెలుగు చూసింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….గోల్కొండ రిసాల బజార్లో నివసించే ఏడాదిన్నర చిన్నారి సోమవారం రాత్రి ఇంటి ముందు ఆడుకుంటున్నది.
ఈ సమయంలో గుర్తుతెలియని అగంతకుడు బాలికను తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక కనిపించక పోవడంతో అమ్మమ్మ వెతుకుతుండగా బాలిక ఏడుస్తూ ఇంటి సమీపంలోనే కనిపించింది. బాలికను పరిశీలించగా రక్తస్రావం జరుగుతుండటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలికను వైద్యం కోసం నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. కేసును గోల్కొండ ఇన్స్పెక్టర్ కొణతం చంద్రశేఖర్ రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.