వ్యక్తిని కట్టేసి కొట్టి.. బలవంతంగా మూత్రం తాగించిన ఆంటీ, అంకుల్

జైపూర్: ఒక వ్యక్తిని కట్టేసి కొట్టడంతోపాటు బలవంతంగా మూత్రం తాగించారు. అతడిపై అత్యాచారం ఆరోపణలు మోపి పోలీసులకు అప్పగించారు. రాజస్థాన్లోని కోటాలో ఈ ఘటన జరిగింది. 22 ఏండ్ల యువకుడి కాళ్లు, చేతులను అతడి దూరపు బంధువులైన దంపతులు కట్టేశారు. అతడ్ని కొట్టడంతోపాటు బలవంతంగా మూత్రం తాగించారు. అతడి వద్ద ఉన్న డబ్బులు, వస్తువులను తీసుకున్నారు. ఒక రాత్రంతా నిర్బంధించారు. మరునాడు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంట్లోకి ప్రవేశించి మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
మరోవైపు ఆ వ్యక్తి సోదరుడు ఈ ఆరోపణలను ఖండించాడు. అహ్మదాబాద్లో పని చేసే తన సోదరుడు ఇటీవల సొంతూరుకు వచ్చాడని తెలిపాడు. జగ్పురా గ్రామంలోని తమ బంధువుల అతడ్ని తమ ఇంటికి రమ్మని పిలిచినట్లు చెప్పాడు. ఈ నెల 14న వారి ఇంటికి వెళ్లిన తన సోదరుడి చేతులు, కాళ్లు కట్టేసి కొట్టారని, బలవంతంగా మూత్రం తాగించి రాత్రంతా నిర్బంధించారని ఆరోపించాడు. సోదరుడి మొబైల్ ఫోన్, ఐడీ కార్డుతోపాటు రూ.22,000 నగదును ఆ దంపతులు తీసుకున్నారని తెలిపాడు.
ఆంటీ, అంకుల్ ఈ దారుణాన్ని తమ మొబైల్లో రికార్డు చేసి పొరపాటున ఆన్లైన్లో పోస్ట్ చేశారని, అది వైరల్ అయ్యిందని ఆ వ్యక్తి సోదరుడు చెప్పాడు. కాగా, వైరల్ అయిన ఈ వీడియో ఆధారంగా ఆ దంపతులతోపాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ప్రవీన్ జైన్ తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- beaten
- drink urine
- forced
- Kota
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

