అబ్దుల్లాపూర్మెట్ : కళాశాల బయటకు వెళ్లిన విద్యార్థి అదృశ్యమైన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శుక్రవారం పోలీసుల తెలిపిన ప్రకారం.. జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి చెందిన బిలాల్ అహ్మద్భట్ (23) పిగ్లీపూర్ గ్రామ పంచాయతీలోని ఎస్ఎల్సి కళాశాలలో ఎఫ్అండ్బి కోర్సులో చేరాడు. గత నెల 31న ఎవరికి చెప్పకుండా కళాశాల నుంచి వెళ్లిపోయాడు. వెంటనే కళాశాల సిబ్బంది అతని కోసం పరిసర ప్రాతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. కళాశాలలో పని చేస్తున్న సునీల్ తోద్వాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.