Hawala Cash Seize | రైల్వే పోలీసుల తనిఖీలు..రూ.1.22 కోట్ల హవాలా డబ్బు పట్టివేత
Hawala Cash Seize | ముంబాయి నుంచి సికింద్రాబాద్కు తరలిస్తున్న భారీ హవాలా డబ్బును రైల్వే పోలీసులు పట్టుకున్నారు.
హైదరాబాద్ : ముంబాయి నుంచి సికింద్రాబాద్కు తరలిస్తున్న భారీ హవాలా డబ్బును ( Hawala Cash ) రైల్వే పోలీసులు( Railway Police ) పట్టుకున్నారు. సుమారు కోటి 22 లక్షల 70 వేల నగదును పట్టుకుని ఒకరిని అరెస్టు చేశారు.
మంగళవారం మధ్యాహ్నం ముంబాయి నుంచి వచ్చిన దేవగిరి ఎక్స్ప్రెస్ ( Devagiri Express Train ) రైలు నుంచి మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన విజయ అంబాదాస్ గుప్తా అనే వ్యక్తి బొల్లారం, మల్కాజిగిరి రైల్వేస్టేషన్లో దిగాడు. పరిసర ప్రాంతాల్లో తిరుగుతుండగా రైల్వే పోలీసులు అనుమానంతో అతని వద్ద ఉన్న బ్యాగ్ను తనిఖీ చేశారు. ఆ బ్యాగ్లో భారీగా నగదు ఉండడంతో అతన్ని లోతుగా విచారించగా నగదు వివరాలను బయట పెట్టాడని రైల్వే పోలీసులు వెల్లడించారు.
ఈ నగదును సికింద్రాబాద్ మోండా మార్కెట్లో జువెల్లరీ షాప్ నడుపుతున్న బంటీ అనే వ్యక్తికి చేరవేయడానికి వచ్చాడని వివరించారు. ఇందుకు ప్రతిఫలంగా విజయ అంబదాస్ గుప్తాకు రూ.5వేలు ఇస్తామని ఇరువురు మధ్య ఒప్పందం చేసుకున్నారని వెల్లడించారు. హవాలా డబ్బును పట్టుకున్న పోలీసు సిబ్బందిని రైల్వే పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

